ఓ భాషలో విజయం సాధించిన సినిమాని మరొక భాషలోకి రీమేక్ చేసినంత మాత్రాన హిట్టు కొట్టేస్తాం అనేది వట్టి భ్రమ మాత్రమేనని అందరికి తెలుసు అది అంత ఈజీ మేటర్ కాదట.ఓ సినిమాని రీమేక్ చేస్తున్నప్పుడు భాషతో పాటు ఆయా రాష్ట్రాల ప్రజల అభిరుచి ఎలా ఉందనే విషయం పై పరిశీలన చేసి అప్పుడు స్క్రిప్ట్ పక్కాగా రెడీ చేసుకోవాలని  తెలుస్తుంది.స్క్రిప్ట్ లో మార్పులు మరియు చేర్పులు వంటివి చేసినా సోల్ మిస్ అయ్యిందంటే మాత్రం ఫలితం తేడా కొట్టే ప్రమాదం ఉంటుందట. ఒక్కోసారి అన్నీ కరెక్ట్ గా కుదిరినా కూడా ఫలితం తారుమారు అవ్వొచ్చని తెలుస్తుంది.. ఉదాహరణకి చెప్పుకోవాలంటే సూపర్ హిట్ రీమేక్ లు అట్టర్ ప్లాప్ లు అయిన సందర్భాలు చాలానే ఉన్నాయని తెలుస్తుంది..

ఇక అసలు మేటర్ కు వస్తే కనుక టాలీవుడ్లో రీమేక్ లు ఎక్కువగా చేసే హీరోల్లో వెంకటేష్ మరియు పవన్ కళ్యాణ్ లతో పాటు రాజశేఖర్ కూడా ఒకరని తెలుస్తుంది.. ఈయన కెరీర్లో ఎన్నో రీమేక్ సినిమాల్లో నటించారని అయితే 'మా అన్నయ్య' అనే చిత్రాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు.ఎందుకంటే ఈ సినిమాకి ముందు రాజశేఖర్ నటించిన సినిమాలన్నీ ప్లాపులేనట. ఆ టైములో తమిళంలో హిట్ అయిన 'వనాథైపోలా' చిత్రం రీమేక్ హక్కులని ఏరి కోరి సొంతం చేసుకున్నాడట రాజశేఖర్. ముందుగా ఈ సినిమాకి వేరే దర్శకుడిని అనుకున్నారట కానీ సెట్స్ పైకి వెళ్ళాక కొన్ని కారణాల వల్ల ఆ దర్శకుడు తప్పుకున్నాడని తెలుస్తుంది.దాంతో కొంతకాలం ఈ చిత్రం షూటింగ్ కు బ్రేక్ పడిందని సమాచారం.

 

ఈ గ్యాప్లో రాజశేఖర్  ముత్యాల సుబ్బయ్య గారి దర్శకత్వంలో 'మనసున్న మారాజు' అనే చిత్రాన్ని కంప్లీట్ చేసి విడుదల చేసాడట ఇది కూడా రీమేక్ సినిమానే కావడం విశేషం.బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి ఫలితాన్నే అందుకుందట. దాంతో రీమేక్ చిత్రాలకి కేరాఫ్ అడ్రెస్ అయిన దర్శకుడు రవిరాజా పినిశెట్టి ముందుకొచ్చి 'మా అన్నయ్య' చిత్రాన్ని కంప్లీట్ చేశారని తెలుస్తుంది.2000వ సంవత్సరం డిసెంబర్ 1న విడుదలైన ఈ చిత్రం ఒరిజినల్ ను మించి బ్లాక్ బస్టర్ అయ్యిందని తెలుస్తుంది. తర్వాత కన్నడంలో కూడా ఈ చిత్రాన్ని రీమేక్ చేయగా అక్కడ కూడా సూపర్ హిట్ అయ్యిందట. ఈరోజుతో ఈ చిత్రం విడుదలై 21 ఏళ్ళు పూర్తికావస్తోందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: