ప్రస్తుతం ఒక వ్యక్తికి అలసట ఒంటినొప్పులు తలనొప్పి తగ్గకుండా రెండు రోజులు మించి ఉంటే వెంటనే కరోనా టెస్ట్ లు చేయించుకోమని వైద్యులు సూచిస్తున్నారు. దీనితో మళ్ళీ కరోనా భయాలు మొదలయ్యాయి. దీనికితోడు ఒమైక్రాన్ కేసులు మహారాష్ట్రా కర్ణాటక లలో ఎంటర్ కావడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు విపరీతంగా ఎలర్ట్ అవ్వడమే కాకుండా ఫంక్షన్స్ అదేవిధంగా సినిమా హాళ్ళు పబ్ లపై ఆంక్షలు పెట్టాలని మహారాష్ట్రా కర్ణాటక ప్రభుత్వాలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.


తెలుస్తున్న సమాచారం మేరకు ఈ రెండు రాష్ట్రాలు తిరిగి ధియేటర్లలో 50శాతం ఆక్యుపెన్సీ వైపు అడుగులు వేస్తున్నాయని దీనికి సంబంధించిన విధివిధానాల రూపకల్పన జరుగుతోంది అన్నవార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈవార్తలు ‘ఆర్ ఆర్ ఆర్’ ‘రాథే శ్యామ్’ నిర్మాతలను కలవర పెడుతున్నట్లు టాక్. ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలు అవ్వడమే కాకుండా ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా మూవీలు దేశవ్యాప్తంగా ఈమూవీకి భారీ కలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే ఈ మూవీ బయ్యర్లు అదేవిధంగా నిర్మాతలు గట్టెక్కగలుగుతారు.


ఇలాంటి పరిస్థితులలో ఈ రెండు సినిమాలకు ఉత్తరాది ప్రేక్షకుల కలక్షన్స్ చాల కీలకం. మళ్ళీ దేశంలోని కొన్ని రాష్ట్రాలలో 50శాతం ఆక్యుపెన్సీ నిబంధనలు మొదలైతే ‘ఆర్ ఆర్ ఆర్’ ‘రాథే శ్యామ్’ లు విడుదల జరుగుతుందా లేక మళ్ళీ వాయిదా పడతాయా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాలలో పరిస్థితులు అదుపులో ఉండటంతో ధియేటర్లలో 100శాతం ఆక్యుపెన్సీ కొనసాగుతోంది.


అయితే మరో నెలరోజుల తరువాత డిసెంబర్ చివరకు పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరికీ అంచనాలకు అందడంలేదు. దీనితో పాన్ ఇండియా మూవీలుగా విడుదల కావలసి ఉన్న ఈ రెండు సినిమాల విడుదల ఆఖరి నిముషంలో వాయిదా పడితే ఈమూవీ ప్రమోషన్ కోసం ఖర్చు పెట్టిన కోట్లాది రూపాయలు వృథా అవుతాయి. ఒకవైపు ప్రభాస్ మరొక వాపి రాజమౌళి ఏక్షణాన్న ‘ఆర్ ఆర్ ఆర్’ ‘రాథే శ్యామ్’ లు మొదలు పెట్టారో వారిని కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: