"అఖండ" ప్రీమియర్ షోలకు అద్భుతమైన స్పందన వస్తోంది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తున్న ఈ సినిమా బాలయ్య కెరీర్లోనే టాప్ లో నిలిచే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే విదేశాల్లో సినిమా ప్రీమియర్లు పడగా ఎవరూ ఊహించని విధంగా కలెక్షన్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఒకవైపు సోషల్ మీడియాలో నందమూరి అభిమానులు హడావిడి చేస్తుంటే, మరోవైపు బాక్స్ ఆఫీస్ పై 'అఖండ' దాడి చేస్తున్నాడు. సినిమా టికెట్ బుకింగ్స్ లో కూడా భారీగానే దూకుడు కన్పించింది. యూకే టిక్కెట్ల విక్రయానికి సంబంధించి నిమిషాల్లోనే టిక్కెట్లు బుక్ అయిపోవడం దీనికి నిదర్శనం.

అయితే తాజాగా ప్రీమియర్ షోలు చూసిన ప్రేక్షకులు, బాలయ్య అభిమానులు ఆయన కెరీర్లోనే ఇదే ఇదే బెస్ట్ మాస్ ఫీస్ట్ అవుతుందని అంటున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ పిచ్చెక్కించింది అంటూ పోస్టులు చేస్తున్నారు. ఇదిలా ఉండగా సినిమాకు సంబంధించిన కలెక్షన్లు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. 'అఖండ' ప్రీమియర్ లకు మంచి రిపోర్ట్స్ రాగా, ట్రేడ్ విశ్లేషకుల సమాచారం మేరకు ఈ సినిమా కేవలం ప్రీమియర్ లకే 275 కే గ్రాస్ క్రాస్ చేసినట్టు తెలుస్తోంది. నిజంగా ఇంత తక్కువ సమయంలోనే ఇలాంటి అద్భుతమైన వసూళ్లు రాబట్టడం అద్భుతమని చెప్పాలి.

ఇక మరోవైపు ప్రపంచవ్యాప్తంగా 'అఖండ' చేసిన రికార్డు స్థాయి ప్రీ రిలీజ్ బిజినెస్ ను బట్టి బాలయ్య దాదాపుగా 60 కోట్లు వసూలు చేయాల్సి ఉంటుంది. వీకెండ్ వరకు ఈ సినిమా చేసే కలెక్షన్లు సినిమా విజయాన్ని ఖరారు చేస్తాయి. ఏదైతేనేం బాలయ్య అభిమానులకు మంచి మాస్ విజువల్ ఫీస్ట్ ఇచ్చాడు 'అఖండ'. సినిమా చూసిన ప్రేక్షకులు ఒళ్ళు గగుర్పాటుకు గురయ్యింది అంటూ 'అఖండ' అనుభవాన్ని నెట్టింట్లో పంచుకోవడంతో సినిమా టాక్ అఫ్ ది టౌన్ గా మారింది. మొత్తానికి బాలయ్య కెరీర్ లోనే ఈ సినిమా ఆల్ టైం రికార్డును బ్రేక్ చేస్తుంది అన్పిస్తుంది.  

 


మరింత సమాచారం తెలుసుకోండి: