బాలయ్య ఏ సినిమాలో నటించినా సరే తన ఉగ్రరూపాన్ని చూపిస్తారు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే సింహా, లెజెండ్ లాంటి సినిమాలతో ఈనాటి యువతకు తానేంటో నిరూపించుకున్న బాలయ్య బాబు.. ఆరు పదుల వయసు దాటినా ఇప్పటికీ ఒకపక్క రాజకీయాలలో బిజీగా ఉంటూనే, మరొక పక్క సినిమాలలో తన సత్తా ఏంటో చాటుకున్నాడు. బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు ఉదయం రిలీజ్ కాగా.. అభిమానులంతా పండగ చేసుకుంటున్నారు.


అంతేకాదు విదేశాలలో సైతం బాలయ్య ఫ్యాన్స్ ఒక రేంజ్ లో హంగామా చేస్తున్నారు అని చెప్పడానికి ప్రస్తుతం వెలువడుతున్న వార్తలే నిదర్శనం అని చెప్పాలి. ఇప్పటివరకు బాలయ్య బాబు ను కనీవినీ ఎరుగని రీతిలో ప్రేక్షకులకు బోయపాటి శ్రీను చూపించారు అని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డ్యుయల్ పాత్రలో నటించిన బాలకృష్ణ..ఒక వైపు ఫ్యాక్షనిస్ట్ గా మరొకవైపు అఘోరాగా మనకు కనిపించారు. అంతేకాదు బాలయ్య బాబు ను ప్రజెంట్ చేసే విధానం కూడా చాలా అద్భుతంగా ఉంది అని చెబుతూ ఉండటం గమనార్హం.


ఇక ఈ ఒక్క సినిమాతో బాలయ్యబాబు రేంజ్ మరింత పెరిగిపోయే లా ఉంది అంటూ ప్రతి ఒక్కరు చెబుతూ ఉండటం గమనార్హం కేవలం అభిమానులు మాత్రమే కాదు ప్రేక్షకులు, సెలబ్రిటీలు సైతం బాలయ్య బాబుకు శుభాకాంక్షలు చెబుతున్నారట. ఇక నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన నందమూరి బాలకృష్ణ.. తండ్రికి తగ్గ తనయుడిగా ఏమాత్రం తీసిపోకుండా సినిమా రంగంలోనూ అటు రాజకీయ రంగంలోనూ దూసుకుపోతున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆర్ ఆర్ ఆర్ సినిమాతో తానేమిటో నిరూపించుకోవడానికి సిద్ధమయ్యాడు.


ఏది ఏమైనా నందమూరి ఫ్యామిలీ మరొకసారి తమ ఉగ్రరూపాన్ని ప్రేక్షకులకు చూపించింది అని ప్రతి ఒక్కరు తెలపడం గమనార్హం. ఈ ఒక్క అఖండ సినిమాతో ఈయన క్రేజ్ పెరిగిపోవడమే కాకుండా విదేశాలలో కూడా అభిమానులు పెరుగుతున్నారు అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: