ఆన్లైన్ టికెట్ బుకింగ్ లు వచ్చాక థియేటర్ల వద్ద టికెట్ కొనుగోలు చేసే వారి సంఖ్య తక్కువయిందనే చెప్పాలి. ఎక్కువ మంది ప్రేక్షకులు చేతిలోని సెల్ఫోన్ తో ఇంటి వద్ద నుండే తమ అభిమాన హీరోల చిత్రాల కోసం టికెట్ ను బుక్ చేసుకుంటున్నారు. ఏ సీట్ కావాలో కూడా చూసి ఎంపిక చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అఖండ మూవీ కోసం కూడా అభిమానులు ఆన్లైన్ లో టికెట్స్ బుక్ చేసుకునేందుకు దూకుడు చూపించారు. టికెట్స్ ఓపెన్ అయిన కాసేపటికే ఏ సైట్ లో చూసినా ఫుల్ అని రావడంతో అభిమానులు షాక్ అయ్యారు. ఇదేంటి ఇంత తక్కువ సమయంలోనే టికెట్స్ అయిపోయాయి అంటూ బాధపడుతున్నారు.
కొందరైతే ఎలాగైనా బాలయ్య సినిమా ఫస్ట్ డే ఫాస్ట్ షో చూడాల్సిందే అని ...థియేటర్ల వద్ద బ్లాక్ లో అయినా టికెట్స్ కోసం ట్రై చేయాల్సిందే అంటూ పడిగాపులు కాస్తున్నారట. మరి ఈ రేంజ్ లో అఖండ సినిమాను చూసేందుకు క్యులు కడుతున్నారు ప్రేక్షకులు. మరి ఈ సినిమా అంతే భారీ విజయాన్ని అందించాలని ఆశిద్దాం. నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో ...ఈ సినిమాపై ప్రేక్షకులకు మరింత ఆసక్తి పెరిగింది. ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ చేస్తుండగా....హీరోయిన్ గా ప్రగ్యా ప్రజ్వల్ చేస్తోంది.