ఈరోజు విడుదలైన 'అఖండ' చిత్రానికి అద్భుతమైన స్పందన వస్తోంది. ప్రేక్షకులు థియేటర్ల నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ హుషారు, వాళ్ళ ముఖాల్లో సంతోషం చూస్తుంటే సినిమా ఎలా ఉందో అర్థమవుతోంది. విదేశాల్లో అయితే నందమూరి అభిమానులు మాస్ జాతర జరుపుతున్నారు. సినిమాలో బోయపాటి చూపించిన మాస్ యాక్షన్ సన్నివేశాలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, క్లైమాక్స్ వంటి సినిమాలోని హైలెట్స్ అన్నింటినీ సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. అంతేకాకుండా సినిమాలోని కీలకమైన సన్నివేశాలను రివీల్ చేస్తున్నారు. అయితే సినిమాలో ముఖ్యంగా మ్యూజిక్ హైలెట్ అంటున్నారు. మ్యూజిక్ లేకపోయినా, అది యంగ్ సెన్సేషన్ థమన్ చేయకపోయినా సినిమాలో సగ భాగం లేనట్టేనని అంటున్నారు. అంటే హిట్ కావడంలో థమన్ ది కూడా కీలక పాత్ర అన్నమాట. నిజానికి సినిమా విడుదలకు ముందే 'అఖండ' గురించి తన ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్పేశాడు థమన్, ఆ శివతాండవం, బాలయ్య రూపం చూస్తే వెంటనే ఇంటికెళ్లి బాలయ్య కాళ్లపై పడాలన్పించింది అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అంతేకాదు సినిమాలో ఆయన పాత్ర చూస్తే ఒళ్ళు గగుర్పొడిచింది అంటూ తన అనుభవాన్ని వివరించాడు.

ఇక థమన్ విషయాని కొస్తే... ఇటీవల కాలంలో తన టైం ఏంటో తనకే అర్థం కావట్లేదు అన్పిస్తోంది. ఏ సినిమాకు మ్యూజిక్ అందించినా అది పక్కా హిట్. గతంలో పలు కాపీ వివాదాల బారిన పడిన థమన్ ఇప్పుడు ఏకబిగిన వరుసగా సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్నారు. అదికూడా సినిమా సినిమాకూ వ్యత్యాసంగా మ్యూజిక్ ఉండేలా చూసుకుంటున్నాడు. 'అలా వైకుంఠపురంలో' ఇచ్చిన బూస్ట్ అయ్యి ఉంటది. ఇప్పుడు ఈ 'అఖండ'మైన విజయంతో ఆయన మరో మెట్టు ఎదిగారు. ప్రస్తుతం ఆయన మ్యూజిక్ అందిస్తున్న 'భీమ్లా నాయక్', 'సర్కారు వారి పాట' చిత్రాలు విడుదలైతే ఆ సినిమాల మ్యూజిక్ చేసే మ్యాజిక్ ద్వారా ఎస్ఎస్ థమన్ టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా నెంబర్ స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది.  




మరింత సమాచారం తెలుసుకోండి: