మంచు లక్ష్మి .. ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. తండ్రి మంచు మోహన్ బాబు నట వారసత్వాని అందిపుచ్చుకుని సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటి. మంచు లక్ష్మి.. కేవలం నటిగానే కాదు, నిర్మాతగా కూడా మంచి మంచి సినిమాలు తీసి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్ని...సినీ ఇండస్ట్రీలో తనదైన స్టైల్లో దూకుపోతున్నారు. కొన్ని షో లకు హోస్ట్ గా కూడా వ్యవహరించారు ఈమె. కేవలం తెలుగు ఇండస్ట్రీకే పరిమితం కాకుండా మంచు లక్ష్మి తన టాలెంట్ తో హాలీవుడ్‌లోనూ నటించి అందరిని మెప్పించారు.

ఇక ఈమె మలయాళంలోకి కూడా ఎంట్రీ ఇస్తున్నారు. ప్రస్తుతం మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ హీరోగా ‘మాన్‌స్టర్‌’ అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇదే సినిమా ద్వారా ఆమె మలయాళంలోకి అడుగుపెడుతున్నారు. ఇక ఈ సినిమాలో లక్ష్మి.. మోహన్‌లాల్‌ భార్య గా నటించనున్నారు. ఈ సినిమా పై భారీ  అంచనాలు పెట్టుకోని ఉన్నారు లక్ష్మి. కాగా ఇండస్ట్రీలో మంచు లక్ష్మీకి ఫ్రెండ్స్ ఎక్కువగా ఉన్నారన్న విషయం విధితమే. ముఖ్యంగా టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ కూతురు మంజుల తో .. మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మికి ఓ ప్రత్యేకమైన అనుబంధం ఉంది.

వీళ్లు చాలా క్లోజ్ ఫ్రెండ్స్  గా ఉంటారు. సొంత అక్క చెల్లెలుగా అన్నీ విషయాలు పంచుకుంటారు. కానీ ఓ ఇంటర్వ్యుల్లో మంజుల..లక్ష్మిని నోరుమూసుకోవే అంటూ మాట్లాడింది. కోపంగా కాదులేండి. జస్ట్ సరదాగా ఫన్నీ టాక్ లో అలా మాట్లాడింది. ఒక ఇంటర్వ్యూలో పాల్గోన్న  వీరు సరదాగా మాట్లాడుకుంటున్న క్రమంలో..  మంచు లక్ష్మి -మంజుల స్వభావం గురించి మాట్లాడుకుంటుండగా..సరదాగా మంజుల.." నోరు మూసుకో..వింటా ఉంటే నువ్వు చెప్తానే ఉంటావు" అంటూ సరదాగా తనని ఆట పట్టించిన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఇద్దరు స్టార్ డాటర్స్ కూడా సినిమాలో తమదైన రీతిలో రాణిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: