మరక్కార్.. సినిమా విడుదల కోసం భారతీయ సినీ ప్రేక్షకులు ఎంతగానో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇది ఒక మలయాళ చిత్రం అయినప్పటికీ.. ఇతర భాషలలో కూడా ఈ సినిమాని విడుదల చేయడంతో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే మలయాళంలో ఇలాంటి సినిమాలు తక్కువగా విడుదలవుతాయి. అందుచేతనే ఇలాంటి సినిమాలకు అక్కడ తక్కువ మార్కెట్ ఉంటున్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు ఓటిటి పుణ్యమా అంటూ.. కొన్ని మలయాళం మూవీస్ కూడా ప్రజలకు బాగానే అర్థం అవుతున్నాయి.

ఇక ఇలాంటి పరిస్థితులలో మోహన్ లాల్, ప్రియదర్శన్ కాంబినేషన్లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఇది. ఇక ఈ మూవీ హాలీవుడ్ లెవల్లో రూపొందించడం గమనార్హం. అందుచేతనే ఈ మరక్కార్ ఆర్ మూవీ మీద అన్ని భాషల ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపుతున్నారు. ఐ సినిమా విడుదల కాకముందే ఈ ఏడాది ఉత్తమ జాతీయ చిత్రంగా నిలుస్తుందని నెటిజన్స్ భావిస్తున్నారు. అయితే రోబో ప్రోమోలో చూపించిన వీడియోలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి.
ఈ సినిమా.. ఒకేసారి మలయాళం కన్నడ, హిందీ వంటి భాషలలో ఈ రోజున విడుదలవుతుంది. తెలుగులో మాత్రం రేపు విడుదల చేయబోతున్నారు. అయితే ఈ మూవీ ఎప్పుడు విడుదల అయినప్పటికీ.. సరికొత్త రికార్డును అయితే నెలకొల్పినట్లు సమాచారం. అది ఏమిటంటే.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్..100 కోట్లకు పైగానే కలెక్షన్ల మార్పును అందుకున్నట్లు.. చిత్ర యూనిట్ సభ్యులు ఒక పోస్టర్ ద్వారా తెలియజేశారు.

ఇలాంటి ఘనత కేవలం మన ఇండియాలోనే మరక్కార్ మూవీ సాధించిందని చెప్పవచ్చు. ఇది కనుక నిజమైతే  ఇది సరికొత్త రికార్డు అని చెప్పవచ్చు. అందులో మలయాళం మూవీ కూడా ఇలాంటి ఘనత సాధించడం అందరిని ఒక్క సారిగా ఆశ్చర్యపరిచింది. ఇక ఏ మూవీ దాదాపుగా 5,000 థియేటర్లో పైగా విడుదల కాబోతోంది. అంటే దాదాపుగా రోజుకి పదహారు వేల షోలు థియేటర్లో పడనున్నాయి. అయితే ఈ సినిమా ఎంత కలెక్షన్ సాధిస్తుందో చూద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: