మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన తాజా సినిమా 'అఖండ'. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్పై మిర్యాల రవీందర్ రెడ్డి దాదాపు 70 కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మించారు. ఇక సినిమాలో బాలయ్య రెండు విభిన్న తరహా పాత్రలు పోషించాడు. అందులో ఒకటి ఫ్యాక్షనిస్టు పాత్ర అయితే మరొకటి ఆఘోరా పాత్ర. ఇక ఎన్నో అంచనాల నడుమ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా వేల థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది ఈ సినిమా. విడుదలైన మొదటి ఆట నుంచే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా కాలంగా నందమూరి అభిమానులు ఎదురుచూస్తున్న కాంబినేషన్ లో అఖండ తో మరో మాస్ హిట్ పడిందని అంటున్నారు.

 ఈ సినిమాలో బాలయ్య నటన, అఘోర పాత్రకి ఇచ్చిన ఎలివేషన్స్, తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రధాన హైలైట్ అని చెబుతున్నారు. అయితే అన్ని వర్గాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకునే ఈ సినిమాని తీసాము అంటూ దర్శకుడు బోయపాటి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. కానీ సినిమా చూస్తే మాత్రం కేవలం మాస్ ఆడియన్స్ కు నచ్చే విధంగానే ఉంది. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని అంతగా ఆకట్టుకోదు. సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ని చూపించిన తీరు రొటీన్ గా అనిపించింది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలపై బోయపాటి పెట్టిన ఫోకస్.. ఫ్యామిలీ ఎమోషన్ సీన్స్ పై పెడితే బాగుండేదేమో. బోయపాటి సినిమాలంటే ఖచ్చితంగా భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి.

 అది సహజమే. కానీ అందుకు తగ్గ ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా పండితే సినిమా ఇంకా బాగుండేది. అఖండ సినిమా బి, సి సెంటర్స్ లో మాత్రమే ఎక్కువగా ఆడే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు ఈ సినిమాలో యాక్షన్ కూడా మితిమీరి ఉందని అంటున్నారు. ఫ్యామిలీ ఆడియెన్స్ కి ఈ సినిమాలో నచ్చే ఒకే ఒక్క అంశం ఏమిటంటే బాలకృష్ణ అగోర పాత్ర మాత్రమే. దేవాలయాలకు జరిగే అన్యాయాల గురించి ఘోర పాత్ర లో బాలయ్యతో పలికించిన డైలాగులు కానీ కొన్ని కొన్ని సన్నివేశాలు మాత్రమే ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చేలా ఉంటాయి. ఇంక మిగతా భాగం చూసుకుంటే అది కేవలం మాస్ ఆడియన్స్ కు మాత్రమే నచ్చుతుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: