బోయపాటి శ్రీను కెరీర్ లో ఎన్నో మాస్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన సినిమాలన్నీటి మీద వచ్చిన పేరు కాస్త రామ్ చరణ్ హీరోగా నటించిన వినయ విధేయ రామ సినిమా తో పోగొట్టుకున్నాడు. ఆ చిత్రంలో మితిమీరిన లెక్కకు మించిన ఫైట్లు అవసరానికి మించిన డైలాగులు ఉండటంతో ఆ సినిమా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ విషయంలో తన మోతాదుకు మించిన స్థాయిలో చేయడం తో ఈ సినిమా ఇంత పెద్ద ఫ్లాప్ అవడానికి కారణం అయ్యింది. ఏదేమైనా వినయ విధేయ రామ చిత్రం ఫ్లాప్ అవడం ఎంతగానో నిరాశ పరిచింది.

ఆ పరాభవం నుంచి కోలుకొని తనకు కలిసి వచ్చిన నందమూరి బాలకృష్ణతో కలిసి ఆయన ఇప్పుడు అఖండ అనే సినిమా చేశాడు. ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు రాగా మొదట్నుంచీ ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా విజయం కు టాలీవుడ్ భవిష్యత్తుకు ముడిపడి ఉందని కూడా చాలాసార్లు చాలా మంది చెప్పారు. రెండవ లాక్ డౌన్ తరువాత తెలుగు సినిమా పరిశ్రమలో రాబోతున్న అతి పెద్ద తొలి చిత్రం కావడంతో హిట్ కొట్టడం తప్పనిసరి అని అందరూ భావించారు. కానీ ఈ సినిమా ఆ స్థాయిలో విజయం సాధించలేదు అనేది ఇప్పుడు బయట వినబడుతున్న వార్త.

ఈ సినిమాలో కూడా వినయ విధేయ రామ సినిమాలో చేసిన తప్పులే రిపీట్ చేయడం బోయపాటి శ్రీను దురదృష్టానికి కారణం అని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో ఆయన సినిమాల్లో ఎక్కువగా హింస ఉంటుంది. కథ ఉండడం లేదు అన్నది ఎక్కువగా వినబడుతున్న వార్త. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు ఆయన కథ విషయంలో కొంత జాగ్రత్త పడి ఉంటే చాలా బాగుండేది అని అందరూ అనుకుంటూ ఉండగా వారిని ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం బాలయ్య ఇమేజ్ మీద సినిమా చేసి చేసిన తప్పులు రిపీట్ చేసి ఇప్పుడు ఫ్లాప్ తో ఈ విధంగా బాధపడాల్సి వస్తుంది. మాస్ హీరో కాబట్టి కలెక్షన్లు తప్పకుండా వస్తాయి కానీ బాలయ్య కెరీర్ లో ఇది ఒక యావరేజ్ సినిమాగా మిగిలిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: