ఒకటే భాషకు సంబంధించిన ఓ సినిమా కథను కొన్ని మార్పులతో అదే భాషలో మరో టైటిల్ తో తెరకెక్కించిన సందర్భాలు చాలా ఉన్నాయని తెలుస్తుంది.. అలా ఒకటే కథ ను ప్రేక్షకులు చాలా వరకు గుర్తుపట్టలేక పోతారట.
ఎందుకంటే కథలో మార్పులు ఉండటం వల్ల అదే కథ అని తెలుసుకోలేకపోతారని కానీ కొన్ని సందర్భాలలో ప్రేక్షకులు వెంటనే గుర్తుపట్టేస్తుంటారని తెలుస్తుంది.. బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న సినిమా కథను మాత్రం పక్కా గుర్తుపెట్టుకుంటారట ప్రేక్షకులు. కానీ ఈ సినిమాను మాత్రం ఎవరూ అంతగా గుర్తు పట్టలేకపోయారని తెలుస్తుంది.

అది ఏ సినిమానో కాదు కే జి ఎఫ్ అని తెలుస్తుంది.ఈ సినిమా 2018 లో తెరకెక్కగా ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించాడట.. హోమ్ భలే ఫిల్మ్ నిర్మాణ సంస్థ పై విజయ్ కీర్గందూర్ నిర్మాతగా చేశాడని ఈ సినిమాకు రవి బుస్రూర్ సంగీతాన్ని అందించాడట.. ఈ సినిమాను 80 కోట్ల బడ్జెట్ తో పెట్టుబడి పెట్టగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద 250 కోట్లను వసూలు చేసుకుందని తెలుస్తుంది.

ఇక ఈ సినిమా కథ గురించి అందరికీ తెలిసినదే. ఇందులో రాకీ తన చిన్న వయసులో తండ్రిని కోల్పోయి తల్లి పెంపకంలో పెద్ద అవుతాడని ఆ తర్వాత తన పద్నాలుగేళ్ళ వయసులో తన తల్లిని కోల్పోతాడని ఆ తర్వాత పెద్ద హోదాలో బ్రతకాలన్న ఆశ తో డబ్బు సంపాదించాలని ముంబైకి చేరుకొని షూ పాలిష్ చేస్తుంటాడని తెలుస్తుంది. అలా ముంబైలో అలీ మరియు శెట్టి కి మధ్య ఆధిపత్య పోరు సాగుతూ ఉంటుందట.

ఆ సమయంలోనే శెట్టి పక్షాన నిలబడ్డ రామకృష్ణ రాఖీ గా ఎదుగుతాడని రాకీ బలం తెలుసుకున్న రాజ వర్ధన్ తనను బెంగళూరుకి పిలిపించి గరుడ చంపమని కోరతాడని దీంతో అక్కడ అవకాశం కోల్పోవటంతో కే జి ఎఫ్ కు వెళ్తాడట.అక్కడ రాకీ చేసే ప్రయత్నాలే సినిమాలోని అసలు కథని తెలుస్తుంది.అయితే ఇటువంటి కథతోనే మెగాస్టార్ కు సంబంధం ఉందని తెలుస్తుంది.ఎందుకంటే ఇటువంటి కథతోనే చిరంజీవి గతంలో ఓ సినిమాలో నటించాడట. 1986లో ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రాక్షసుడు అని ఈ సినిమాలో చిరంజీవి, సుహాసిని, రాధా నటీనటులుగా నటించారట.. ఇక ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కగా మంచి బ్లాక్ బస్టర్ హిట్ సంపాదించుకొని భారీ వసూళ్లు సొంతం చేసుకుందట.ఇక ఈ సినిమా కథ కూడా చాలావరకు కేజిఎఫ్ తోనే పోలి ఉంటుందని తెలుస్తుంది.నిజానికి ఈ సినిమా కథనే కే జి ఎఫ్ గా తెరకెక్కించారని చెప్పవచ్చట.ఇందులో చిరంజీవిని ఒకడు చేసిన మోసం వల్ల అడవిలో పెరిగి పెద్ద అవుతాడట.. ఇక ఒక స్నేహితుడితో అక్కడి నుంచి తప్పించుకొని తన తల్లి కోసం వెతుకుతాడని అలా ఒక బృందం తన తల్లిని చూపిస్తానని ఒప్పందం చేసుకొని తన తల్లి కోసం చేసే పోరాటమే కేజిఎఫ్ లాగా ఉంటుందట.అలా చాలావరకు కే జి ఎఫ్ ను పోలి ఉండటంతో చిరంజీవికి ఈ సినిమాతో సంబంధం ఉందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: