నందమూరి తారక రామారావు, రామ్ గోపాల్ వర్మ... ఈ రెండు పేర్లకు పరిచయం అక్కర లేదు. ఇరువురు కూడా  సినీ రంగ ప్రముఖులు. ఒకరు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడనే బిరుదును సంపాదించుకున్నవారు. మరోకరు సంచలన దర్శకులు. ఎన్టీఆర్ సినీ రంగంలో నుంచి రాజకీయ రంగంలోకి ప్రవేశించిన వ్యక్తి. ఇక రామ్  గోపాల్ వర్మ సినిమాలే కాదు, ఆయన చేష్టల తోనూ  అంటే సామాజిక మాధ్యమాలలో తన పోస్టులతో అశేష జనవాహినిని ఆకట్టుకునే వ్యక్తి.
 సినీ రంగ ఆరంగేట్రంలోనే  శివ చిత్రం ద్వారా సంచలనాలకు నమోదు చేసిన రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా... ఏం తీసినా సంచలనమే. ఆయన తీసిన బయోగ్రాఫికల్ చిత్రం లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌. ఈ సినిమా  రామ్ గోపాల్ వర్మసినిమా తీస్తున్నానని ప్రకటించగానే తెలుగు రాష్ట్రాల ప్రజలు ఒక్కసారిగా నివ్వెర పోయారు.  జనం గుండెల్లో దేవుడిగా ముద్ర వేసుకున్న తమ అభిమాన నాయకుడు నందమూరి రామారావు బయోగ్రఫీ పై సినిమా నా ? అంటూ ముక్కు మీద వేలేసుకున్నారు.  సినిమా నిర్మాణ సమయంలో ఆంధ్ర ప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా   నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఆయన స్వయాన ఎన్టీఆర్ కు అల్లుడు.
ఈ చిత్రం విడుదలకు ముందే రాజకీయంగా హీటెక్కించింది. రామారావు అర్థాంగిగా లక్ష్మీపార్వతి ప్రవేశం.. ఆమెకు వైవాహిక జీవితంలో ఎదురైన సంఘటనలతో సినిమా ఉంటుందని రామ్ గోపాల్ వర్మ ముందే ప్రకటించారు. దీంతో రాజకీయ వర్గాలలో సహజంగానే ఉత్సుకత ఎక్కువైంది.
ఎన్టీఆర్ అన్న మహోన్నత వ్యక్తి ఎందుకు, ఎలా ఒంటరి వాడయ్యారు ? అమె జీవితంలోకి లక్ష్మీ పార్వతి అనే వ్యక్తి ఎలా ప్రవేశించారు. వారిద్దరి మధ్య. మలి సంధ్యలో ప్రేమ ఎలా పుట్టింది ? వారి వైవాహిక జీవితంలో సంభవించిన పరిణామాలు ఏమిటి అన్న ఇతివృత్తంలో కథ, కథనం సాగుతాయి. ఈ చిత్రంలో నటీనటులందరూ సినీరంగానికి కొత్త ముఖాలే. ఎన్టీఆర్  పాత్రను రంగస్థల నటుడు విజయ్ కుమార్ పోషించారు. లక్ష్మీ పార్వతిగా యజ్ఞశెట్టి  సహజంగా నటించారు. బాబూరావు అనే  రాజకీయ వేత్త పాత్రను శ్రీతేజ్  పోషించారు.  అందరూ కొత్త వారే కావడం ఈ సినిమాకు ఓ పెద్ద అట్కాక్షన్ గా చెప్పుకోవచ్చు. ఇది ఒక సాహసం కూడా. అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చిన కథాంశం కావడంతో నాటి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ సినిమా విడుదలను శతవిధాల అడ్డుకుంది. కొద్ది రోజులు ఈ సినిమా అనుకున్న సమయానికి  ఆంధ్ర ప్రదేశ్ లో విడుదల కాలేదు.   ఇతర ప్రాంతాలలో విడుదలై సంచలనాలు నమోదు చేసింది. ఈ సినిమాను చూసేందుకు జనం రైళ్లు, బస్సుల్లో హైదరాబాద్ కు వెళ్లి తిలకించారు. ఓ పెద్ద హీరో సినిమా కోసం అభిమానులు సుదూరం ప్రయాణించడం  చూడటం రివాజు. అలాంటిది అందరూ కొత్త నటీనటులతో తీసిన సిన్మా కోసం ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన సినీ అభిమానులు పొరుగు రాష్ట్రాలకు వెళ్లి మరీ  చూశారు. దటీజ్ రామ్ గోపాల్ వర్మ


మరింత సమాచారం తెలుసుకోండి: