స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఎక్కువే. అందరితో కలిసి జాలీగా ఫన్నీగా మాట్లాడుతారు. ఆయన సినిమా షూటింగ్ సెట్ లో ఉన్నంత సేపు ఓ పండగ వాతావరణం కనిపిస్తుంది అంటారు అక్కడున్న వారు. అంతేకాదు బన్నీ ఏ ఇంటర్వ్యుకి వెళ్లినా కూడా వారితో సరదాగా మాట్లాడుతూ కనిపిస్తారు. ఎంత ఎదిగిన అందరితో కలిసి ఉండాలి అని బన్నీ చూసే నేర్చుకోవాలి అంటారు అభిమానులు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో " పుష్ప" అనే సినిమా చేస్తున్న బన్నీ..ఈ సినిమాతో తన ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ విజయం వేసుకోవడమే కాకుండా..ఫస్ట్ టైం తన కెరీర్ లోనే పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కుతున్న మూవీ కూడా ఇదే కావడం గమనార్హం.

ఇక ఈ సినిమాలో ఫస్ట్ టైం కన్నడ సోయగం రష్మిక మందన డిగ్లామరస్ లుక్ లో కనిపించనుంది. ఈ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా క్రిస్మస్ కానుకగా ఈ నెల 17 న ధియేటర్స్ లో గ్రాండ్ గా  విడుదల చేసేందుకు చిత్ర బృందం ఇప్పటికే అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. ఇక పాన్ ఇండియా మూవీలో వస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ ని కూడా స్టార్ట్ చేసారు బన్నీ. ఇప్పటికే ఈ సినిమాకి కావాల్సినంత పబ్లిసిటీ వచ్చేసింది. పాటలు,  మాస్ లుక్,డైలాగ్స్ తో ఈ సినిమా పై అభిమానులు ఓ రెంజ్ లో ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.

ఇక ప్రమోషన్స్ లో భాగంగా బన్నీ ఈటీవీలో ప్రసారమౌతున్న "ఢీ" షోకి గెస్ట్ గా వెళ్లారు. ఇక అక్కడ ఆయన చేసిన సందడి అంతా ఇంతా కాదు. మైన్ జడ్జీలు  ప్రియమణి, పూర్ణ దగ్గర నుండి..కంటెస్టెంట్స్ వరకు అందరిని పలకరిస్తూ..ఫన్నీ గా  జోక్స్ వేస్తూ.. నవ్విస్తూ ఫుల్ ఎంజాయ్ చేసారు. ఈ క్రమంలో ప్రియమణి "నేను ఇప్పటి వరకు మీతో నటించలేదు. మీతో వర్క్ చేయలేదనే బాధ నాకు చాలా ఉంది అంటుండగా.. బన్నీ మాట్లాడుతూ .. "అలా ఏం అనుకోవద్దు నీకు ఇప్పటికీ ఛాన్స్ ఉంది" అంటూనే... "మీరు సన్నగా మారి చాలా హాట్ గా తయారు" అంటారు. దీంతో అక్కడున్న వారంతా ఫన్నీగా నవ్వుకుంటారు. ప్రస్తుతం ఈ  వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక దీని పై కొందరు నెటిజన్స్ స్పందిస్తూ.. అల్లు అర్జున్ కి ప్రియమణి అంత నచ్చిందా..హాట్ అంటూ కామెంట్స్ చేయడం ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.





 

మరింత సమాచారం తెలుసుకోండి: