టాలీవుడ్ లో ఒక్కప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హీరోలు సడెన్ గా తెర పై కనిపించకుండాపోయారు. అలాంటి హీరోల్లో వేణు కూడా ఒకరు. స్వయంవరం అనే సినిమాతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆయన..మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్ని .. వరుస సినిమాల్లో నటిస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు తొట్టెంపూడి వేణు. చూసేందుకు చక్కటి రూపం ..ఆరు అడుగుల హైట్ ఆ హైట్ కు తగ్గ వెయిట్..హ్యాండ్ సం లుక్స్ లో కనిపిస్తారు. యాక్టింగ్ కూడా బాగా చేస్తారు. కానీ ఎందుకో హీరోగా సక్సెస్ అవ్వలేకపోయాడు.

వేణు నటించిన సినిమాలన్నీ బాక్స్ ఆఫిస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టాయి. ముఖ్యంగా ఆయన నటించిన చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్, పెళ్ళాం ఊరెళితే సినిమాలు గురించి చెప్పనవసరం లేదు. ఇప్పటికి ఈ సినిమాలో టీవీలో వస్తే చూసి పగలబడి నవ్వుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన అనతికాలంలోనే మంచి విజయాలు సాధించి ఎంత వేగంగా వచ్చాడో అంతేవేగంగా ఇండస్ట్రీ నుంచి కనుమరుగయ్యారు తొట్టెంపూడి వేణు. కాగా ఎన్నో హిట్ మూవీస్ లో నటించిన వేణు గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు.

 లాస్ట్ గా వేణు నటించిన చిత్రం  రామాచారి మూవీ. అంతకంటే ముందు  జూనియర్ ఎన్టీఆర్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన దమ్ము మూవీలో ఆయన కీలక పాత్రలో కనిపించాడు. ఈ సినిమా ఆయనకు పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. దీంతో  సినిమా రంగానికి దూరంగా ఉంటున్నాడు. కాగా కెరీర్ మంచి జోష్ మీద ఉన్నప్పుడే అనుపమ చౌదరి అనే  అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు వేణు. ఈ అమ్మాయి చదువులో టాప్. వేణు భార్య యూనివర్సిటీ ఆఫ్ మద్రాసులో ఎం బి ఏ పూర్తిచేసింది. ఇక ఈమె కూడా కొన్ని సినిమాల్లో నటించారు. కన్నడ సినీ పరిశ్రమలో కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించింది వేణు భార్య. ప్రస్తుతం వీరిద్దరు హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: