ఇప్పటికి వరకు సినిమా ఇండస్ట్రీలో మనం చూసిన్నట్లైతే ఓ హీరో కానీ, హీరోయిన్ కానీ.. ఇండస్ట్రీలో వచ్చి సక్సెస్ అయితే ఇక ఆలస్యం చేయకుండా వెంటనే వాళ్ల చెల్లి కానీ, తమ్ముడిని కానీ, లేక వాళ్ల కజిన్స్ ని కానివ్వండి సినిమాలోకి రప్పిస్తారు. ఎప్పటి నుండో ఈ ఆనవాయితి సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతుంది. ఇప్పటికే ఇలా అక్క పేరు, అన్న పేరు, తండ్రి పేరు చెప్పుకుని సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన వారు చాలామందే ఉన్నారు. వాళ్లలో కొందరు సక్సెస్ అయ్యారు..మరికొందరు అట్టర్ ఫ్లాప్ అయ్యారు. అలాంటి వాళ్లలో ఈ ఆనంద్ దేవరకొండ కూడా ఒకరు.

యూత్ ఐకాన్ గా పేరు తెచ్చుకున్న క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కి ఎలాంటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొదట్లో సినిమాల కోసం బాగా కష్టపడి.. చివరకు వాళ్ల తమ్ముడిని కూడా ఇండస్ట్రీలోకి తెచ్చుకునేంతలా ఎదిగాడు. కానీ ఏం చేద్దాం తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది అన్నట్లు ఎన్నో ఆశలతో తమ్ముడు లైఫ్ ను సెట్ చేద్దాం అనుకున్న ఈ రౌడీ హీరోకి నిరాశ తప్పలేదు. తనని హీరోగా ఆదరించిన జనం..వాళ్ల తమ్ముడు విషయంలో  మాత్రం అలా చేయలేకపోయారు. ఈ క్రమంలో ఆనంద్ దేవరకొండ  నటించిన సినిమాలు బాక్స్ ఆఫిస్ వద్ద బోల్తా కొట్టడం మొదలుపెట్టాయి. రీసెంట్ గా వచ్చిన "పుష్పకవిమానం" సినిమా అయితే దారుణంగా దెబ్బతీసింది.

మొదటినుండి ఈ సినిమా పై ఓ రేంజ్ లో ఎక్స్ పెక్ట్ చేసారు. కానీ సీన్ లోకి ఎంటర్ అవ్వగానే మొత్తం మారిపోయింది. సినిమా రిలీజ్ అయ్యి ఊహించినంత కలెక్షన్స్ రాబట్టలేకపోయాయి. దీంతో తీవ్ర నిరాశ చెందారు ఈ దేవరకొండ బ్రదర్స్. కాగా ఆనంద్ దేవరకొండ రీసెంట్ గా నటిస్తున్న చిత్రం హైవే. ఈ సినిమాలో హీరోయిన్ గా మలయాళీ ముద్దుగుమ్మ మానసా రాధాకృష్ణన్ నటిస్తుంది. గుహాన్ డైరెక్ట్ చేసిన  ఈ సినిమాని  వెంకట్ తలారి  ఎంతో అద్భుతంగా నిర్మించారు. తాజాగా ఈ సినిమా నుండి మోషన్ పోస్టర్లను రిలీజ్ చేసారు చిత్ర బృందం.  ఈ పోస్టర్  నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో ఆనంద్ ఇప్పటి  వరకు చేయని సరికొత్త పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తుంది. మరి చూడాలి ఈ సినిమాతోనైనా ఈ హీరో హిట్ కొడతాడా అనేది..?

 

మరింత సమాచారం తెలుసుకోండి: