ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ' రౌద్రం, రణం రుధిరం'.డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సుమారు 450 కోట్ల భారీ బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇక తాజాగా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతంగా జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇక విడుదల సమయం దగ్గర పడుతుండటంతో ఈ సినిమా ప్రమోషన్స్ ని చిత్ర యూనిట్ వేగవంతం చేశారు.

 ఈ క్రమంలోనే ఇప్పటికే ఈ సినిమా నుంచి పలు అప్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక తాజాగా సినిమా నుంచి 'నాటు నాటు' అంటూ ఓ మాస్ సాంగ్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పాట ప్రేక్షకులందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే ఈ పాట ప్రభంజనం సృష్టించింది. ఇక తెలుగు తో పాటు అన్ని భాషల్లో విడుదలైన ఈ పాట యూట్యూబ్లో ఇటీవలే 80 మిలియన్ వ్యూస్ ని దక్కించుకుంది. ఇక తాజాగా నాటు సాంగ్ మరో అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది. యూట్యూబ్లో ఈ పాటకు ఏకంగా వన్ మిలియన్ లైక్స్ దక్కాయి. ఇప్పటివరకు తెలుగు సినిమాలకు చెందిన ఏ పాటలు కూడా కేవలం మూడు వారాల వ్యవధిలో మిలియన్ లైక్స్ ని సొంతం చేసుకోలేదు.

 కానీ నాటు నాటు పాట మాత్రం మూడు వారాల్లోనే  మిలియన్ లైక్స్ మార్క్  అందుకని సంచలన రికార్డు ని అందుకుంది. ఈ పాటలో ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ అద్భుతమైన మాస్ స్టెప్స్ వేయడంతో ఈ పాటకు ఈ రేంజ్ లో లైకులు వచ్చాయి. ఇక బిగ్ స్క్రీన్ పై ఈ పాటను చూడాలని మెగా, నందమూరి అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు సైతం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పీరియాడికల్  ఫిక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు గా,తారక్ కొమురం భీమ్ గా కనిపించనున్నారు. ఇక వీరి సరసన ఆలియాభట్ ఒలీవియా మోరిస్ కథానాయికలుగా నటిస్తున్నారు. బాలీవుడ్ అగ్ర నటుడు అజయ్ దేవగన్, సముద్రఖని, శ్రీయ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

RRR