ఏపీలో సినీ రాజకీయ వేడి బాగా పెరిగిపోతుంది. అయితే ఇదంతా ఓటిటి పై సినీ పరిశ్రమ ప్రేమ పెరిగిపోవటమే అని కొన్ని వర్గాలు భావిస్తున్నాయి. ఒకపక్క ఓటిటి వైపు సినీ వర్గాలు చూస్తుంటే, మరోవైపు తమ పరిస్థితి ఏమిటనే డైలమాలో పడిన థియేటర్ యాజమాన్యాలు తమకు అనుకూలంగా ఉన్న కొందరు నిర్మాతలతో కలిసి ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. దీనితో ఏమి చేయాలని సమాలోచన చేయగా, ఆన్ లైన్ విధానం బాగుంటుందని ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఇదంతా వాళ్ళు నిర్ణయించుకున్నదే కాబట్టి, వాళ్ళు కోరుకున్నట్టుగా ప్రభుత్వం వ్యవస్థలో సాంకేతిక వెసులుబాటును మార్గాలు సుగమం చేసింది. సాధారణంగా ఎవరైన ఏదైనా కావాలి అనుకుని ఒక నేత వద్దకు వెళితే ఆయన తన కు చేతనైనది అయితే చేస్తాడు, లేదంటే అధిష్టానం ముందు ఆ విన్నపం ఉంచుతాడు, తద్వారా ఆ పని జరిగిపోయేట్టు చూస్తాడు.

అలాగే నష్టపోతున్నాం అనే ఇదితో అటు నిర్మాతలు, ఇటు థియేటర్ యాజమాన్యాలు ప్రభుత్వం దగ్గరకు ఒక ఆలోచనలతో రావడం, దానిని ప్రభుత్వం నెరవేర్చడం జరిగింది. అన్ని అందరకు నచ్చవు, అలాగే ఈ పద్దతి కూడా కొందరిని నచ్చలేదు. దీని ని పట్టుకొని విపక్షాలు తప్పుడు ప్రచారం చేయడం లాంటివి చేస్తున్నారు. సహజంగా పన్ను సరిగ్గా రాబట్టుకోవడం ఒక ప్రభుత్వ విధి, సినీ రంగంలో అలాంటి ఎగవేతలు ఎక్కువగా ఉండటం చేత వాటిని ఇలా సర్దుబాటు చేసినట్టుగా కూడా ప్రభుత్వం వైపు నుండి భావించిన విషయం అయిఉండొచ్చు. ఇవన్నీ పరిగణలోకి తీసుకోని ఒక విషయం గురించి మాట్లాడాలి. కేవలం నచ్చని దానిని పట్టుకొని దానినే ప్రచారం చేయడం కాదు.  ప్రభుత్వం అన్నాక అనేక వర్గాల వారు తమపనులు చేయాలని కోరినప్పుడు అవన్నీ సాధ్యమైనవైతే చేసిపెడుతోంది. ఇక్కడ అదే జరిగింది.  

కరోనా లో ఎంతో నష్టపోయిన థియేటర్ యాజమాన్యాలు, ఓటిటి వైపు సినీ పరిశ్రమ చూడటంపై మరింత మనక్షోభకు గురవడంతో ఈ మార్గాన్ని ఆలోచించి ఉండొచ్చు. దానిని ప్రభుత్వం సాయంతో పూర్తి చేసుకున్నారు. సినీ పరిశ్రమ కూడా థియేటర్ల గురించి ఆలోచించకుండా తమ సినిమాలను ఓటిటిలో విడుదల చేయడం సబబేనా అని ఆలోచించి ఉంటాయి కదా. ఇది అంతే అవుతుంది. అది సబాబైతే, ఇది కూడా సబబే. ఒకదానిలో ఒకరికి నష్టం, అందుకే మరో దానిని వాళ్ళు వెతుక్కోవాల్సి వచ్చింది. ఇదంతా సినీ రాజకీయం, ప్రభుత్వ రాజకీయం కాదు. కానీ కొందరు ప్రభుత్వానికి దీనిని అంటగట్టడానికి చూస్తున్నారు. మరో ప్రయోజనకరమైన మార్గం ఒకవేళ ఉంటె, దానిని సినీ పెద్దలు, యాజమాన్యాలు కలిసి ఆలోచించుకొని, దానిని కూడా చేసిపెట్టాలి అనే ప్రభుత్వం వీలును బట్టి చేస్తుంది.

ప్రస్తుత విధానంలో కూడా ప్రయోజనాలు, లోపాలు కూడా ఉండొచ్చు. వాటిని మెల్లిగా సరిచేసుకుంటూ పోతేసరి. ప్రజలకు టిక్కెట్ ధర వలన కలిగే ప్రయోజనం  ఉండబోదు, దాని ధర ఎంత ఉన్నా చూడాలి అనుకున్నవాడిని ఎవరు ఆపలేరు, వద్దు అనుకున్నవాడిని ఎవరు బలవంతం చేసినా ప్రయోజనం ఉండబోదు. అలాగే ఒక చిత్రం వలన పరిశ్రమకు లేదా నిర్మాతకు లేదా మరెవరికైనా సరే, పది చోట్ల పది రూపాయలు వస్తాయని అనుకుందాం. అందులో ఒక్క చోట కనీసం మాత్రమే వస్తూ మిగిలిన చోట్ల యధావిధిగా వస్తున్నప్పుడు సమస్య ఏమిటి, ఆ తగ్గిన మొత్తాన్ని కూడా ఇతర చోట్ల పెంచుకునే మార్గాలు వెతుక్కునే దారిలేదంటారా.. ఆలోచించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: