ప్రస్తుతం తెలుగు బుల్లితెర పై ఒకటే చర్చ నడుస్తుంది. అదే యాంకర్ రవి ఎలిమినేషన్ గురించి. బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా  పేరు తెచ్చుకున్న యాంకర్ రవి కనీసం టాప్ ఫైవ్ లో ఉంటారు అని బుల్లితెర ప్రేక్షకులు అందరూ భావించారు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న మిగతా కంటెస్టెంట్ తో పోల్చి చూస్తే  యాంకర్ రవి కే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అలాంటి యాంకర్ రవి తక్కువ ఓట్లు వచ్చాయి అన్న కారణంతో గత వారం ఎలిమినేట్ అయ్యాడు. ఈ ఎలిమినేషన్ తో హౌస్ లో ఉన్న సభ్యులతో పాటు బయట ఉన్న ప్రేక్షకులను కూడా షాక్ కి గురిచేసింది.



 అయితే రవి ఎలిమినేట్ కావడంతో ఇక బిగ్బాస్ నిర్వాహకులపై ఎన్నో అనుమానాలు వ్యక్తం చేయడం మొదలుపెట్టారు ప్రేక్షకులు.కుట్ర పూరితంగానే రవి ఎలిమినేషన్ జరిగింది అంటూ ఎంతో మంది ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు కూడా పెట్టారు అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ ఎలిమినేషన్ విషయంలో తెలంగాణ-ఆంధ్ర అనే ఒక నినాదాన్ని తెరమీదకు తెచ్చారు అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతం అభిమానులందరూ ఆనందపడే ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గతవారం హౌస్ నుండి ఎలిమినేట్ అయిన రవి మళ్లీ బిగ్ బాస్ హౌస్ లో కి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అన్న టాక్ వినిపిస్తోంది.


 సాధారణంగా అయితే బిగ్ బాస్ హౌస్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ, రీ ఎంట్రీ లాంటివి ఉంటాయి. కానీ బిగ్ బాస్ హౌస్ లో అలాంటి ట్విస్ట్ లు ఎక్కడా లేవు. మరీ ఇప్పుడు రవి గురించి వినిపిస్తున్న టాక్ నిజమేనా అన్న అనుమానం కూడా అభిమానుల్లో మొదలైంది. రవి ఈ వారాంతంలో మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళి పోతున్నాడు అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే బిగ్ బాస్ గేమ్ ప్రస్తుతం ఫైనల్ స్టేజ్ కి చేరుకున్న సమయంలో రవి మళ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి పంపించడం ఏంటి అంటూ కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండటం గమనార్హం. మరి రవి నిజంగానే బిగ్ బాస్ హౌస్ లోకి రీఎంట్రీ నిజమా అబద్దమా అనేది ఈ వారాంతంలో తెలిసిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: