టాలీవుడ్ సీనియర్ మోస్ట్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ ఏజ్ లో కూడా యంగ్ హీరోలకు దీటుగా సినిమాలు చేస్తున్నాడు వెంకీ. ఇటీవల నారప్ప సినిమాతో ఓ టి టి వేదికగా ప్రేక్షకులను అలరించి బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న ఈ సీనియర్ హీరో దృశ్యం 2  సినిమాతో అదే ఓ టి టి లో మరో విజయాన్ని అందుకుని ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఎఫ్ 2 సినిమా సీక్వెల్ ఈ సినిమాలో నటిస్తున్నాడు వెంకీ. ఇక ఈ సినిమాలో వెంకీ తో పాటు మరో హీరో గా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న విషయం తెలిసిందే.

 పూర్తి డబ్బు చుట్టూ తిరిగే ఈ సినిమాలో వెంకీకి జోడిగా మిల్కీబ్యూటీ తమన్నా,వరుణ్ కి జోడిగా మెహరీన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.ఇక ఇదిలా ఉంటె వెంకటేష్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం తెగ ఆరాటపడిపోతున్నాడట. ఇక ఆ వివరాల్లోకి వెళితే... మలయాళం లో 2019 లో విడుదలైన 'డ్రైవింగ్ లైసెన్స్' అనే సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ సూరజ్ వెంజరముడు ఇద్దరు ప్రధాన పాత్రలు పోషించారు. మలయాళంలో ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుని అద్భుతమైన విజయాన్ని అందుకుంది. దీంతో తెలుగులో ఎప్పటినుంచో ఈ సినిమాని రీమేక్ చేయాలని..

చాలామంది దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేశారు.అయితే ఇప్పుడు ఇదే డ్రైవింగ్ లైసెన్స్ తెలుగు రీమేక్ లో విక్టరీ వెంకటేష్ నటించబోతున్నాడట. తన ఎఫ్ త్రీ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే డ్రైవింగ్ లైసెన్స్ రీమేక్ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్లు ఓ వార్త బయటకు వచ్చింది. ఈ మధ్య వెంకటేష్ కి రీమేక్ సినిమాలు బాగా కలిసి వస్తున్నాయి.నారప్ప, దృశ్యం2 విషయాల్లో అది నిరూపితమైంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో మళయాళ రీమేక్ లో వెంకీ నటించబోతున్నట్లు తెలుస్తోంది. మరి ప్రస్తుతం ప్రచారంలోకి వచ్చిన ఈ వార్తలో వాస్తవం ఎంతో తెలియాలంటే దీనిపై పూర్తి స్పష్టత రావాల్సిందే...!!

మరింత సమాచారం తెలుసుకోండి: