యూట్యూబర్స్‌ షణ్ముఖ్‌ జస్వంత్ - దీప్తి సునైనాల ప్రేమ గురించి ఎంత పాపుల‌రో తెలిసిందే. తెలుగు సోష‌ల్ మీడియాను వీరు ఒక ఊపు ఊపేస్తున్నారు. ఇప్ప‌టికే వీరిద్ద‌రు త‌మ ప్రేమ గురించి ఓపెన్ గానే చెప్పేశారు. ఇద్ద‌రూ కూడా ఒక‌రి పేరు మ‌రొకరు టాటూ గా కూడా వేయించు కున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం ష‌ణ్ముక్ బిగ్ బాస్ - 5 హౌస్ లో ఉన్నారు. ఇక బ‌య‌ట ఉన్న దీప్తి సున‌య‌న అయితే ష‌ణ్ముక్ ను ప్ర‌మోట్ చేసేందుకు స‌ర్వ శ‌క్తులు ఒడ్డు తున్నారు. బాగా క‌ష్ట ప‌డుతోంది. లాస్ట్ వీకెండ్ లో ష‌ణ్ముక్ ను ప్ర‌మోట్ చేసేందుకే దీప్తి సున‌య‌న బిగ్ బాస్ హౌస్ కు కూడా వ‌చ్చింది.

ష‌ణ్ముక్ కు ఓట్లు వేసి గెలిపించాల‌ని కూడా త‌న సోష‌ల్ మీడియాలో బాగా ప్ర‌చారం చేస్తోంది. ష‌ణ్ముక్ కోసం ఆమె అంత‌లా క‌ష్ట‌ప‌డు తుండ‌డంతో ఖ‌చ్చితంగా ష‌ణ్ముక్ బిగ్ బాస్ విన్న‌ర్ అయినా ఆశ్చ‌ర్య పోలేద‌ని నిన్న‌టి వ‌ర‌కు ప్ర‌చారం కూడా జ‌రిగింది. అయితే ఇప్పుడు దీప్తి ఉన్న‌ట్టు ఉండి త‌న స్టాండ్ ను మార్చుకుంది. దీంతో జ‌నాలు అంద‌రూ కూడా షాక్ అవుతున్నారు. షణ్నూకి కాకుండా మరో బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌కి దీప్తి తన మద్దతు ఇవ్వ‌డం సంచ‌ల‌నం గా మారింది.

అంతే కాకుండా అత‌డికి తాను ఓటు వేసిన ఓట్స్ స్క్రీన్ షాట్ ను సైతం సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డం విశేషం. ప్రస్తుతం దీప్తి షేర్‌చేసిన ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మార‌డం తో పాటు ప్ర‌తి ఒక్క‌రి లోనూ చ‌ర్చ‌కు కార‌ణ‌మైంది. మ‌రి ఆ కంటెస్టెంట్ ఎవ‌రా ? అని మీరు ఓ బుర్ర‌లు బ‌ద్ద‌లు కొట్టు కోవ‌ద్దు.. అత‌డు తెలుగు బిగ్ బాస్ కంటెస్టెంట్ కాదు. త‌మిళ బిగ్ బాస్‌కు చెందిన వ్య‌క్తి.

ప్ర‌స్తుతం త‌మిళ్ లో బిగ్‌బాస్ - 5 సీజ‌న్ స్టార్ట్ అవుతుంది. ఈ నేప‌థ్యంలో వ‌రుణ్ అనే కంటెస్టెంట్ కు దీప్తి సున‌య‌న త‌న స‌పోర్ట్ ప్ర‌క‌టించింది. అత‌డికి ఓట్లు వేసి గెలిపించాలంటూ దీప్తి త‌న ఫాలోవ‌ర్ల‌ను కోరింది. అది అస‌లు సంగ‌తి. అందే కాని ఆమె ష‌ణ్ముక్ కు ఏం షాక్ ఇవ్వ‌లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: