ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అగ్ర దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ 'పుష్ప'.మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతోంది.డిసెంబర్ 17 న ఈ సినిమా మొదటి భాగం విడుదల కానుంది.ఈ నేపథ్యంలో ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఒక్కో పాట సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తుంది. ఇక సినిమా లో అగ్రహీరోయిన్ సమంత ఓ స్పెషల్ సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సాంగ్ కి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది.

 ఇక ఈ స్పెషల్ సాంగ్ త్వరలోనే విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇటీవల చిత్రబృందం అధికారికంగా తెలియజేస్తూ ఓ స్పెషల్ పోస్టర్ ని కూడా విడుదల చేసింది. ఆ పోస్టర్లో సమంత లంగా, జాకెట్ ధరించి మాస్ లుక్ లో బ్యాక్ సైడ్ మాత్రమే కనిపించే విధంగా ఆకట్టుకుంది. దీంతో ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 'సిజ్లింగ్ సాంగ్ ఆఫ్ ద ఇయర్' గా వస్తున్న ఈ స్పెషల్ సాంగ్లో సమంత అదిరిపోయే స్టెప్పులు వేసినట్లు సమాచారం. అయితే ఈ సాంగ్ ఫుల్ మాస్ నెంబర్ తో 'ఊ అంటావా మావా.. ఊ ఊ అంటావా మావా' అనే లిరిక్స్ తో సాగుతుందట. ఇక ఈ మాస్ నెంబర్ లో బన్నీ వేసే డాన్సులు మరో రేంజిలో ఉండబోతున్న ట్లు తెలుస్తోంది.

ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన విషయం తెలిసిందే.ఇక ఈ స్పెషల్ సాంగ్ కి అయితే దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే లెవల్లో ట్యూన్ అందించినట్లు సమాచారం. ఇక సుకుమార్ - బన్నీ- దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్లో వచ్చే స్పెషల్ సాంగ్స్ ఏ విధంగా ఉంటాయో గతంలో మనం చూశాం. అంతకుమించి పుష్ప స్పెషల్ సాంగ్ ఉండబోతున్న ట్లు తెలుస్తోంది.దానికి తోడు సమంత మొదటిసారి బన్నీ తో కలిసి స్పెషల్ సాంగ్ చేస్తుండడంతో కచ్చితంగా ఈ పాట భారీ రికార్డులను క్రియేట్ చేస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరో రెండు రోజుల్లో ఈ పాట షూటింగ్ పూర్తి కాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ స్పెషల్ సాంగ్ కోసం బన్నీ ఫాన్స్ అయితే ఎంతో ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: