ఒక సినిమాను యాక్షన్, ఫ్యామిలీ డ్రామా, పొలిటికల్ డ్రామా, వంటి వివిధ కోణాలలో తీయడం సినిమా పరిశ్రమకు కొత్త విషయమేమీ కాదు. ఇటువంటి తరహాలో వచ్చిన ఫ్యాక్షన్- పొలిటికల్ డ్రామా నే లెజెండ్ సినిమా. 2014లో విడుదలైన లెజెండ్ సినిమా బోయపాటి మరియు బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా. ఈ సినిమాను 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ క్రింద సంయుక్తంగా నిర్మించి, వారాహి చలన చిత్రం ద్వారా సమర్పించారు.

 ఈ సినిమా బడ్జెట్ 40 కోట్లు కాగా 110 కోట్లు కలెక్ట్ చేసి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా కొన్ని సెంటర్లలో 350 రోజులు, 400 రోజులు కూడా ఆడింది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
ఈ సినిమాలో బాలకృష్ణ గారు డ్యూయల్ రోల్ ప్రదర్శించారు, జగపతి బాబు గారు విలన్ గా, రాధిక ఆప్టే,సోనాల్ చౌహాన్, సుమన్ నటించారు. ఈ చిత్రం 1989లో జితేంద్ర( జగపతి బాబు) , అతని తండ్రి ఒక ప్రాంతంలో డాన్ గా చలామణి అవుతూ ఉంటారు. స్థానిక ఎమ్మెల్యే ఇంటికి పెళ్లి చూపుల కోసం వైజాగ్ కు వస్తారు. తిరిగి వెళ్లేటప్పుడు ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటనలో జితేంద్ర తండ్రి చనిపోతాడు. దాంతో జితేంద్ర పెద్దమనిషి( సుమన్) కుటుంబంపై భయపడతాడు. సుమన్ తల్లి వీళ్ళు కూడా తాత తండ్రి లాగానే హత్యకు గురవుతారని భయపడుతుంది. దాంతో వాళ్లు వైజాగ్ వదిలేసి విదేశాలకు వెళ్లి పోతారు.


 తండ్రి చావును అవమానంగా ఫీల్ అయిన జితేంద్ర ఆ ప్రాంతాన్ని మన కంట్రోల్లో తీసుకుంటాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు జితేంద్ర సిఎం అవ్వాలని అనుకుంటాడు. తనకు సపోర్ట్ గా కొంత మంది ఎమ్మెల్యేలను కొని సీఎం అవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. దాన్ని ఆపడానికి నందమూరి బాలకృష్ణ గారు ఏం చేస్తారు అన్నది సినిమా కథగా సాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: