టాలీవూడ్ ఇండస్ట్రీలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన ఇండస్ట్రీకి అల్లు రామలింగయ్య వారసుడిగా అడుగుపెట్టారు. అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ బ్యానర్ ని ప్రారంభించిన అరవింద్ విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. అంతేకాదు.. ఆయన ఏదైనా ఒక సినిమా నిర్మిస్తున్నారు అంటే ఆ సినిమా బాక్సాఫీసు వద్ద తప్పకుండా విజయం సాధిస్తుందని అందరు ఎంతో నమ్ముతూ ఉంటారు.

అంతేకాదు.. అల్లు అరవింద్  కథల ఎంపిక విషయంలో ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తూ ఉండటంతో ఇండస్ట్రీలో బడా నిర్మాతగా రాణిస్తున్నారు. ఈ తరుణంలోనే  ఇప్పటికి మెగా హీరోలలో పవన్ కళ్యాణ్ మినహా మిగిలిన వారందరూ కూడా ఇతని సలహాలు తీసుకుంటూ ఉంటారని సమాచారం. అల్లు అరవింద్ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు, పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నఆయనకు ముగ్గురు కొడుకులు అనే విషయం అందరికి  తెలిసిన విదితమే.

ఆయన ముగ్గురి కొడుకులు అల్లు వెంకట్ అలియాస్ బాబి సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ అల్లు అర్జున్ అల్లు శిరీష్ ఇండస్ట్రీలో ఉంటూ అందరికీ సుపరిచితమైన వారే. ఇక ఇండస్ట్రీలో అల్లు అర్జున్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అల్లు శిరీష్ మాత్రం ఇండస్ట్రీలో అంతగా రాణించలేకపోతున్నారు. ఇక అల్లు అరవింద్ కొడుకుల  విషయం అందరికీ తెలుసు కానీ నిజానికి ఈయనకు నలుగురు పిల్లలు ఉండేవారంట. వారిలో ఒక్క కొడుకు అల్లు రాజేష్ 7 సంవత్సరాల వయసులోనే రోడ్డు ప్రమాదంలో మరణించాడు.

అల్లు రాజేష్, అల్లు వెంకట్ కి అల్లు అర్జున్ కి మధ్య జన్మించారు. ఇక అప్పటికే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న అల్లు అరవింద్ భార్య తన కొడుకు మృతి చెందడంతో ఎలాగైనా తనకు మరి తన కొడుకు రాజేష్ కావాలని పట్టుబట్టి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కు ప్రత్యామ్నాయంగా మరొక ఆపరేషన్ చేయించుకున్నారని సమాచారం. ఆ తరువాత వారికీ అల్లుశిరీష్ జన్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: