సాధారణంగా చిత్ర పరిశ్రమలో కథ నచ్చితే ఇతర భాషల సినిమాలను రీమేక్స్ చేస్తుంటారు. ఇక ప్రస్తుతం ఒక్క సినిమాను ఒకేసారి ఇతర భాషలోకి అనువాదం చేసి ఒకేసారి వాటిని రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇండియన్ ఫస్ట్ మడ్ రేసింగ్ మూవీగా భారీ బడ్జెట్ తో తెలుగు, కన్నడ, హిందీ, తమిళ మరియు మలయాళం మొత్తం 5 భాషల్లో ప్యాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న సినిమా మడ్డీ. ఈ సినిమా తెలుగు, తమిళ, మళయాలం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ చిత్రం డిసెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

అంతేకాదు..ఈ సినిమాను ఎన్నడూ చూడని కాన్సెప్ట్ తో ఉత్కంఠ రేపేలా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాతోనే ప్రగభల్ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రంలో యువన్, రిధాన్ కృష్ణ ప్రధాన పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాను PK7 క్రియేషన్స్ బ్యానర్ పై ప్రేమ కృష్ణదాస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాని రెండు తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజు విడుదల చేయాబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ను నవంబర్ 30న సాయంత్రం 4:30 గంటలకు విడుదల చేయబోతోన్నట్టు ఓ పోస్టర్ ద్వారా వెల్లడించారు.

ఈ సినిమాను దర్శకుడు ప్రగభల్ కి ఆఫ్ రోడ్ రేసింగ్ పట్ల ఉన్న ఆసక్తి, అనుభవం నుండే ప్రధానంగా మడ్డీ రూపొందించారు. ఈ చిత్రం ఐదు సంవత్సరాల రీసెర్చ్ అనంతరం పక్కా స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని తీసిన ఈ సినిమా ప్రధానంగా రెండు వేర్వేరు జట్ల మధ్య శత్రుత్వం, ప్రతీకారం గురించి ఉన్నప్పటికీ ఫ్యామిలీ డ్రామా, హాస్యం, సాహసం ఇలా ప్రతి ఎమోషన్ లో చిత్రకరించారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని తెలుగులో ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి విడుదల చేశారు. ఈ  టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంది. దీంతో సినిమాపై కూడా అంచనాలు భారీగా పెరిగాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: