‘లెజెండ్’ మూవీ తరువాత బాలకృష్ణకు ఒక్క హిట్ కూడ లేదు. ఆసినిమా విడుదలై 8 సంవత్సరాలు గడిచిపోయాయి. మూడు సంవత్సరాల క్రితం బాలకృష్ణ ఎంతో కష్టపడి నటించిన ఎన్టీఆర్ బయోపిక్ ను పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. దీనితో గత కొన్ని సంవత్సరాలుగా తన కెరియర్ కు సంబంధించి తీవ్ర అసహనానికి లోనవుతున్న బాలకృష్ణకు ‘అఖండ’ విజయం ఊహించని ఉత్సాహాన్ని ఇచ్చింది.


వాస్తవానికి ఈసినిమాకు రివ్యూలు ఏమాత్రం బాగా రాకపోయినప్పటికీ రివ్యూలతో సంబంధం లేకుండా ఈసినిమాకు మాస్ ప్రేక్షకులతో పాటు యూత్ కూడ విపరీతంగా వస్తున్నారు. దీనితో ‘అఖండ’ సూపర్ హిట్ అన్న నిర్ణయానికి వచ్చేశారు. ఈ ఫలితాన్ని ఆస్వాదిస్తూ బాలకృష్ణ మంచి జోష్ లో ఉన్నాడు. ఈసినిమా విడుదలరోజు సాయంత్రం భాగ్యనగరంలోని ఏఎంబీ మాల్ లోని ధియేటర్ లో బాలకృష్ణ ఈసినిమా యూనిట్ తో కలిసి ప్రేక్షకుల మధ్య ఈమూవీని చూసాడు.

ఈమూవీ ఇంట్రవెల్ లో బాలకృష్ణను చూసిన అనేకమంది అబ్బాయిలు అమ్మాయిలు బాలకృష్ణ చుట్టూ చేరి వరసపెట్టి సెల్ఫీలు తీసుకుంటూ ఉంటే బాలయ్య వారందరితో చాల నవ్వుతూ కొన్ని క్షణాలు గడిపాడు. ఈ సందర్భంలో కొందరి యూత్ బాలయ్య దగ్గరకు వెళ్ళి ‘చాల బాగాచేసారు అంకుల్’ అంటే బాలకృష్ణ నవ్వుకుంటూ ‘అంకుల్ కాదు తాత’ అనండి ఎటువంటి అసహనం లేకుండా జోక్స్ వేయడం చూసినవారు బాలయ్య ఇంత మారిపోయాడా అంటూ కామెంట్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఈషో పూర్తి అయిన తరువాత బాలకృష్ణ మీడియా వర్గాలతో మాట్లాడుతూ మరింత ఉత్సాహంగా కనిపించాడు. అంతేకాదు ఈసినిమాలో బోయపాటి తన భావజాలాన్ని కాపీ కొట్టి డైలాగ్స్ రాయించాడని అందువల్ల తనకు బోయపాటి రాయల్టీ ఇవ్వాలి అంటూ జోక్ చేసి ఒక ఆసక్తికర విషయాన్ని షేర్ చేసాడు. ‘మామూలుగా తాను దేవుడిని చూపించు’ అన్న వాళ్లను ఒక దెబ్బ కొట్టి మాట్లాడతానని ‘ఆ నొప్పి కనిపించిందా అని అడిగి, అదే దేవుడు’ అంటానని ఈవిషయాన్ని గ్రహించి బోయపాటి ఈ సినిమాలో  ‘‘దేవుడిని కరుణించు అనాలి. కనిపించు అని కాదు’’ అని డైలాగ్ పెట్టి ఉంటాడని అందుకే తనకు రాయల్టీ కావాలి అంటూ చెప్పడంతో మీడియా వర్గాలు తెగ నవ్వుకున్నట్లు టాక్..



మరింత సమాచారం తెలుసుకోండి: