ఆ విలన్ పేరు నితిన్ మెహతా.. ఈ నటుడు 21 సంవత్సరాల పాటు ఇండియన్ ఆర్మీ లో పని చేశారు. అయితే ఆయన ఒక ప్రొఫెషనల్ మోడల్ కావాలన్న కోరిక తో.. సినీ ఇండస్ట్రీ వైపు అడుగు పెట్టారట. దాని కోసం తన కు గౌరవం తెచ్చిన ఆర్మీ యూనిఫారం కూడా వదులుకున్న ట్లు సమాచారం. అలా చేసిన తర్వాత మోడల్ గా గుర్తింపు తెచ్చుకోవడానికి కొన్ని సినిమాలలో నటించినట్లు సమాచారం. కానీ ఆశించిన స్థాయిలో ఆయన పేరు రాలేదట.
కానీ ఇప్పుడు అఖండ మూవీతో ఈయన పేరు బాగా వినిపిస్తోంది. అయితే వాస్తవానికి అఖండ సినిమా ట్రైలర్ లోనే.. నితిన్ మెహతా అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు. ముఖ్యంగా ఈయన డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాదిరే ఉండడంతో.. బాలకృష్ణ సినిమాలో విలన్ గా త్రివిక్రమ్ నటిస్తున్నారు అంటూ కొంతమంది సోషల్ మీడియా లో మీమ్స్ క్రియేట్ చేశారు. దీంతో ఈ ఆర్మీ ఆఫీసర్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.
ప్రస్తుతం నితిన్ మెహతా వయసు వచ్చేసరికి 48 సంవత్సరాలు కావడం గమనార్హం. ఈయన భారత సైన్యం లో ఎలా ఫిట్ గా ఉన్నారో ఇప్పటికి కూడా ఆ ఫిజిక్ ని మెయింటైన్ చేయడం నెటిజెన్స్ కు చాలా ఆశ్చర్యం కలిగింది. ఫిట్నెస్ తోనే తన మోడలింగ్ వైపు అడుగు పెట్టాడని సినీ ఇండస్ట్రీలో టాక్.