మరి ఇంతటి ఘన విజయానికి కారణం ముఖ్యంగా ఫైట్స్ మరియు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అని చెప్పొచ్చు. ఫైట్స్ జరుగుతున్న సమయంలో తమన్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ అబ్బా ఆ సౌండ్ కే గూస్ బమ్స్ వచ్చేస్తాయి. సునామీ పరుగులు తీస్తున్న ఫీలింగ్ వస్తుంది. అఘోరగా బాలయ్య ఎంట్రీ సీన్ నుండి క్లైమాక్స్ వరకు ఎన్నో ఎలివేషన్ లు ఫైట్ లు ఉన్నాయి. కాగా అన్ని ఫైట్స్ ప్రేక్షకులను కళ్ళు తిప్పుకోకుండా చేస్తున్నాయి. అయిన బాలయ్య ఈ వయసులో ఆ ఫైట్స్, ఆ డ్యాన్స్ అంటే 'బాబోయ్ బాలయ్య బాబు తోపు' అంటున్నారు అభిమానులు. అలా ఈ సినిమా మొదట అనుకున్న అంచనా లెక్కలను మించిన రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటోంది అఖండ మూవీ.
ఇక ఈ చిత్రంలో ప్రత్యేకంగా పూర్ణ పాత్రకు అభిమానులు నీరాజనాలు పలుకుతున్నారు. సినిమా సినిమాకి వైవిధ్యాన్ని కనబరుస్తూ పూర్ణ తన నట విశ్వరూపాన్ని చూపిస్తున్నారు అంటూ ప్రశంసలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఉన్నంతలో తన పాత్ర లో ఒదిగిపోయిందని ప్రేక్షకులు అంటున్నారు. భవిష్యత్తులో ఈమెకు మరిన్ని మంచి అవకాశాలు వస్తాయని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.