టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మెగా నందమూరి వారి మధ్య భారీ పోటీ నెలకొని ఉంటుంది. ఈ నేపథ్యంలో వారి మధ్య కొన్ని మనస్పర్థలు కూడా ఏర్పడ్డాయని మొన్నటి వరకు వార్తలు రాగా ఇటీవల అఖండ సినిమా ఫంక్షన్ కు మెగా హీరో అల్లు అర్జున్ హాజరై తమ మధ్య అభిప్రాయభేదాలు ఏమీ లేవని చాటి చెప్పారు. దాంతో అభిమానులు వీరి కలయిక పట్ల ఒక్కసారిగా ఎంతో ఖుషి అయ్యారు. ఇంకో వైపు మెగా నందమూరి అభిమానుల మధ్య విబేధాలు తగ్గడానికి ఆర్ఆర్ఆర్ సినిమా కూడా ఒక కారణం అయ్యింది.

సినిమా కంటే ముందు వీరిద్దరి మధ్య తారాస్థాయిలో విభేదాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. దానికి తగ్గట్లు వీరు మాట్లాడుకోకపోవడం ఎదురుపడ్డ కూడా  పలకరించుకున్న సందర్భాలు లేకపోవడం వంటివి వీరికి మరింత ఆజ్యం పోసినట్లు అయ్యింది. అయితే తాజాగా వీటన్నిటికీ సమాధానాలు చెబుతూ మెగా నందమూరి  హీరోల మధ్య మాంచి మైత్రి ఏర్పడుతుంది. అఖండ సినిమా సమయం లో వీరి మధ్య మైత్రి కొంత బలపడగా ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ సినిమా విడుదల సమయం లో వీరి మైత్రి మరింత బలపడుతుంది అని అందరు అనుకుంటున్నారు.

ఇకపోతే వీరి మధ్య మైత్రి ఎలా ఉన్నా కూడా పోటీ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. ఈ రెండు కుటుంబాలకు చెందిన హీరోల సినిమా లు రాబోతున్నాయి. తాజాగా ఎన్టీఆర్  హీరోగా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల తేది దగ్గర పడుతుండటంతో సినిమా కి సంబంధించిన కార్యక్రమాలను శరవేగంగా చేస్తుంది చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలోనే ట్రైలర్ ను విడుదల చేయాలని అది కూడా డిసెంబర్ 10వ తేదీన విడుదల చేయాలని సన్నాహాలు చేస్తుండగా మెగా హీరో అల్లు అర్జున్ నటించిన ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను కూడా అదే రోజున విడుదల చేయాలని ఆ సినిమా యూనిట్ భావిస్తుంది. అలా ఆ రోజున ఇద్దరు హీరోల అభిమానులకూ పండుగ రోజు లాంటిది అని చెప్పవచ్చు

మరింత సమాచారం తెలుసుకోండి: