ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఒక షెడ్యూల్ హైదరాబాద్లో మరో షెడ్యూల్ పూణే లో పూర్తి చేశారు. అయితే ఇప్పుడు మూడో షెడ్యూల్ మొదలు కాకుండానే కష్టాలు మొదలయ్యాయి. శంకర్ ముందుగా ఇండియన్ 2 సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది. అయితే ఈ సినిమా నిర్మాతలకు - శంకర్ కు మధ్య గొడవలు జరుగుతున్నాయి. చివరకు కోర్టు జోక్యంతో లైకా ప్రొడక్షన్స్ వారు - శంకర్ ఒక ఒప్పందానికి కూడా వచ్చారు.
మధ్యలో కమల్ హాసన్ కరోనా భారిన పడడంతో ఇండియన్ 2 మరింత ఆలస్యమవుతోంది. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకున్న శంకర్ కూడా ఈ సినిమాకు కాల్షీట్లు కేటాయించారు. అయితే ఇప్పుడు శంకర్ ఆ సినిమాను ముందుగా పూర్తి చేయాల్సి ఉంది. ఆ సినిమా పూర్తి అయిన తర్వాత రామ్ చరణ్ సినిమా స్టార్ట్ చేయాలి. మరో వైపు రామ్ చరణ్ ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఉన్నారు.
ఆర్ఆర్ ప్రమోషన్లు కొనసాగుతున్నాయి. ఈ ప్రమోషన్ ఆ తర్వాత చరణ్ ఖాళీగా ఉంటాడు. అయితే ఇండియన్ 2 సినిమా షూటింగ్ పూర్తయ్యేంత వరకూ చరణ్ ఖాళీగా ఉండటం తప్పా చేసేదేం లేదు.