బాలీవుడ్ లవ్ బర్డ్స్ విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ పెళ్లి వార్తలతో గత కొన్ని రోజులుగా ముఖ్యాంశాల్లో నిలుస్తున్నారు. వీరిద్దరి పెళ్లికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. విక్కీ, కత్రినా తమ పెళ్లి కోసం ఎప్పుడైనా రాజస్థాన్‌ కు బయలుదేరే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు ఈ జంట తమ పెళ్లి గురించి మౌనంగానే ఉన్నారు. అదే సమయంలో ఫొటోగ్రాఫర్లు వారి వివాహానికి సంబంధించిన ప్రతి అప్‌డేట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ఓ నేషనల్ పత్రిక నివేదిక ప్రకారం విక్కీ ఇంటి బయట నిలబడి ఉన్న కెమెరామెన్లకు విక్కీ కుటుంబం తరపున భోజనం ఏర్పాటు చేశారు. విక్కీ, సన్నీ, శామ్‌ కౌశల్‌ల డ్రైవర్‌, కెమెరామెన్‌కి భోజనం ఏర్పాటు చేశారు. ఈ ఆలోచన విక్కీ తండ్రి షామ్ కౌశల్ కి వచ్చిందని తెలుస్తోంది.

కత్రినా కైఫ్ విక్కీ ఇంటి బయట కనిపించింది
కొంతకాలం క్రితం కత్రినా, ఆమె కుటుంబం విక్కీ కౌశల్ ఇంటి బయట కనిపించింది. కత్రినా సన్నిహిత మిత్రుడు రచయిత, నిర్మాత అమృతపాల్ సింగ్ బింద్రా కారు విక్కీ ఇంటి బయట కనిపించింది. సమాచారం ప్రకారం ఆ సమయంలో విక్కీ, కత్రినా కోర్టు వివాహం చేసుకున్నారు. డిసెంబర్ 9న రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్‌లో విక్కీ, కత్రినా వివాహం రాయల్ పద్ధతిలో జరగనుంది. కత్రినా ఇంటి వెలుపలి నుండి కూడా కుటుంబం రాజస్థాన్‌ కు బయలుదేరుతున్న వీడియోలు బయటపడ్డాయి.

వివాహ వేదికను అలంకరించారు
లీకైన కొన్ని ఫోటోల ప్రకారం వివాహానికి సన్నాహాలు జోరుగా జరుగుతున్నాయి. రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్ జిల్లాలోని బార్వారా ఫోర్ట్‌లో విక్కీ, కత్రినా పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. కోటను కొవ్వొత్తులు, లాంతర్లతో అలంకరించారు. ఎప్పటి నుంచో పెళ్లి వార్తలు వస్తున్నా కోట అలంకారమే కన్ఫామ్ చేసింది. బార్వారా కోటను సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ అని కూడా అంటారు.

సంగీతం నుండి వివాహ థీమ్ వరకు
సంగీతం నుండి విక్కీ, కత్రినాల వివాహం వరకు, థీమ్ ఇప్పటికే సెట్ చేశారు. డిసెంబరు 6న విక్కీ, కత్రినా కుటుంబాలు రాజస్థాన్ వెళ్లనున్నారు. డిసెంబర్ 7వ తేదీ నుంచి వివాహ వేడుకలు ప్రారంభం కానున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: