ప్రస్తుతం బిగ్ బాస్ కార్యక్రమం బుల్లితెర ప్రేక్షకులు అందరినీ ఆకర్షిస్తూ టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటుంది. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఎవరు ఎప్పుడు ఎలిమినేట్ అవుతారు అన్నది దాదాపు ప్రేక్షకులకు ఒక క్లారిటీ ఉంటుంది. ప్రతి వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అన్నది ముందుగానే ఊహిస్తూ ఉంటారు ప్రేక్షకులు. ఈ క్రమంలోనే బిగ్బాస్ కార్యక్రమం మొదలైన నాటి నుంచి అదిగో ఎలిమినేట్ అవుతుంది.. ఇదిగో ఎలిమినేట్ అవుతుంది అంటూ ట్రాన్స్ జెండర్ గా బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన ప్రియాంక సింగ్ పై ఎన్నో వార్తలు వచ్చాయి. దాదాపు బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేషన్ గురించి వచ్చిన ప్రతి వార్తలో కూడా ప్రియాంక సింగ్ పేరు ఉంది అని చెప్పాలి.


 ఇక ప్రియాంక సింగ్ ఎలిమినేట్ కావడం ఖాయం అని ప్రేక్షకులు కూడా భావించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా ప్రతి ఎలిమినేషన్ దాటుకుంటూ వచ్చిన ప్రియాంక సింగ్ టాప్ 7 వరకు వచ్చింది. ఈ క్రమంలోనే టాప్-5లో చోటు దక్కించుకోవటానికి ఎంతగానో కష్టపడింది. కానీ టాప్ సెవెన్ లో ఉండగానే హౌస్ నుండి ఎలిమినేట్ అయింది ప్రియాంక సింగ్. నిన్నటి ఎపిసోడ్ లో ప్రియాంక సింగ్ ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చింది. ఇక హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ప్రియాంకకు కన్నీళ్లతో వీడ్కోలు పలికారు. ఇక మానస్ ను వదిలి వెళ్తున్నందుకు ప్రియాంక సింగ్ కూడా ఎంతో ఎమోషనల్ అయ్యింది.



 అయితే బిగ్ బాస్ అడుగుపెట్టిన ప్రియాంక అటు భారీగానే  సంప్రదించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం అయితే ప్రియాంక సింగ్ వారానికి 1.75 నుంచి రెండు లక్షల వరకు పారితోషకం తీసుకున్నారట.ఈ లెక్కన పింకీ 13 వారాలకు గాను మొత్తంగా పాతిక లక్షల వరకూ సంపాదించింది అన్నది తెలుస్తోంది. అయితే షోలో పర్ఫామెన్స్ ను బట్టి పారితోషకం అటూ ఇటూ గా ఉండే అవకాశం కూడా ఉంటుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: