టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ ఎన్నో హిట్, సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు, అయితే వెంకటేష్  రీమేక్ సినిమాల ద్వారా కూడా ఎన్నో విజయాలను సాధించాడు. ప్రస్తుతం కూడా వెంకటేష్ ఎక్కువ శాతం రీమేక్ సినిమాల మీదే దృష్టి పెట్టాడు, ఇప్పటికే  తమిళంలో సూపర్ హిట్ అయిన అసురన్ సినిమాను తెలుగులో నారప్పా పేరుతో రీమేక్ చేసి విడుదల కూడా చేశాడు, ఈ సినిమా నేరు గా ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యి మంచి ప్రశంసలు దక్కించుకుంది, ఇలా ఈ రీమేక్ సినిమా తో వెంకటేష్ ఈ సంవత్సరం మంచి విజయా న్ని అందుకున్నాడు.

ఆ తర్వాత మలయాళం లో సూపర్ హిట్ అయిన దృశ్యం టు సినిమా ను అదే పేరుతో తెలుగు లో రీమేక్ చేసిన వెంకటేష్ ఈ సినిమాను కూడా నేరుగా అమెజాన్ ప్రైమ్ ఓటిటి విడుదల చేశాడు, ఈ సినిమా కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది, ఇలా వరుస రీమేక్ ల మీద దృష్టి పెడుతున్న వెంకటేష్ మరో రీమేక్ సినిమాలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వెంకటేష్ 2019 లో విడుద లై మంచి విజయం సాధించిన డ్రైవింగ్ లైసెన్స్ సినిమాను రీమేక్ చేసే ఆలోచన లో ఉన్నట్లు తెలుస్తోంది, మలయాళం లో మంచి విజయం సాధించిన ఈ సినిమా రైట్స్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దగ్గర ఉన్నాయి, అయితే రామ్ చరణ్ దగ్గర ఉన్న రైట్స్ ను ప్రస్తుతం గీతా ఆర్ట్స్ కు బదిలీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే గీతా ఆర్ట్స్ సంస్థ ఈ సినిమా ని వెంకటేష్ హీరో గా తెరకెక్కించాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది, మరి ఇప్పటి వరకు ఈ వార్తల పై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువ డలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: