అందాల ముద్దు గుమ్మ కీర్తి సురేష్ రామ్ పోతినేని హీరో గా తెరకెక్కిన నేను శైలజ సినిమా తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా మంచి విజయం సాధించడం తో పాటు కీర్తి సురేష్ నటన కు, అంద చందాలకు కూడా తెలుగు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పడటం తో ఈ ముద్దు గుమ్మకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రేజీ సినిమా ఆఫర్లు వచ్చాయి, అందులో భాగంగా నాగ అశ్విన్ దర్శకత్వం లో తెరకెక్కిన మహానటి సినిమాలో హీరోయిన్ గా నటించిన ఈ ముద్దు గుమ్మ కు ఈ సినిమా ద్వారా నటిగా మంచి గుర్తింపు దక్కడం మాత్రమే కాకుండా, ఎనలేని పేరు ప్రతిష్టలు కూడా దక్కాయి.

 ఇలా నటిగా గొప్ప గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ పెంగ్విన్, మిస్ ఇండియా లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. అయితే కీర్తి సురేష్ తాజా గా గుడ్ లక్ సఖి అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది, ఈ సినిమాను డిసెంబర్ 10 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు కొన్ని రోజుల క్రితం చిత్ర బృందం ప్రకటించింది. అయితే తాజా గా ఈ చిత్ర బృందం ఈ సినిమాను డిసెంబర్ 10 వ తేదీ న విడుదల చేయడం లేదు అని, గుడ్ లక్ సఖి సినిమాను డిసెంబర్ 31 వ తేదీ న విడుదల చేయబోతున్నట్లు తెలియజేశారు. ఈ మూవీ లో ఆది పినిశెట్టి, జగపతి బాబు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు, గుడ్ లక్ సఖి చిత్రాన్ని నిర్మాత దిల్‌ రాజు సమర్పణ లో ‘వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్’ బ్యానర్ పై సుధీర్ చంద్ర ప‌దిరి నిర్మిస్తున్నారు. ఇప్పటి వర కు విడుదలైన ఈ సినిమా ప్రచార చిత్రా లకు, పాటలకు జనాల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: