నందమూరి బాలయ్య నటించిన అఖండ సినిమా డిసెంబర్ 2న విడుదలై రికార్డులు సృష్టిస్తుంది. బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఇప్పటి వరకు వచ్చిన సినిమాల కన్నా ‘అఖండ' సినిమా బ్రహ్మాండమైన విజయంతో దూసుకెళ్తుంది. అంతేకాదు.. సరైన బ్లాక్‌బస్టర్ లేక దిగాలుగా ఉన్న టాలీవుడ్‌కి అదిరిపోయే రికార్డును ఇచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రగ్యా జైస్వాల్ నటించారు. అలాగే సినిమాలో కీలక పాత్రలో పూర్ణ నటించారు. అంతేకాదు.. ఈ సినిమాతో డబుల్‌ హ్యాపీని బాలకృష్ణ, బోయపాటి, తమన్‌ అందుకుంటున్నారు.

సినిమా ఇంతటి ఘన విజయం సాధించినప్పటికీ ఒకరికి మాత్రం ఈ సినిమా విజయం ఇప్పటివరకు ఎలాంటి ఉపయోగం జరగలేదంట. ఈ సినిమాలో ఆయనను అతి క్రూరంగా శ్రీకాంత్‌ కనిపించరు. ఈ చిత్రం తరువాత వరుస అవకాశాలు పక్కా అనుకున్నా.. ఆ స్థాయిలో రెస్పాన్స్‌ లేదని సినీ ప్రముఖులు అంటున్నారు. బాలయ్య నటించిన లెజెండ్ సినిమాలో విలన్‌గా నటించిన జగపతిబాబు.. ఇప్పటికీ వెర్సటైల్‌ విలన్‌గా వరుస అవకాశాలు అందుకుంటున్నాడు. ఇప్పటికి ఆయనకు ఒకటికి మించి పాత్ర ఇంకొకటి ఆయన తలుపుతడుతూనే ఉన్న సంగతి తెల్సిందే.


అలాగే శ్రీకాంత్‌ విషయంలో మాత్రం ఇలాంటి ఫీల్‌ ఇంతవరకు రాలేదని చెబుతున్నారు. ఇక నటుడు శ్రీకాంత్ పాత్ర విషయంలో చూపించిన అతి… ఆయనకు ఇబ్బంది పెడుతోంది అనే వాదనలూ వినపడుతున్నాయి. అయితే ఈ సినిమాలో శ్రీకాంత్ పూర్ణ రేప్‌ సీన్‌, చిన్న పిల్లాడి తల మీద సుత్తితో కొట్టే సీన్‌… సీన్‌ను ఎలివేట్‌ చేసినా, పాత్రను ఎలివేట్ చేయలేదనే వార్తలు వినిపిస్తున్నాయి.

అంతేకాదు.. ఈ సినిమా గురించి ప్రేక్షకులు మాట్లాడుకునేటప్పుడు చర్చకు వస్తున్నవాటిలో బాలకృష్ణ పర్‌ఫార్మెన్స్‌, బోయపాటి ఎలివేషన్లు, తమన్‌ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ గురించే ఎక్కువగా వినబడుతున్నాయి. కానీ శ్రీకాంత్‌ విలనిజం గురించి అంతగా చర్చ జరగడం లేదు. ఈ సినిమాలో శ్రీకాంత్ పాత్రకు పెద్దగా ఫలితం దక్కలేదు అన్నట్లుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: