దాదాపు వారం రోజుల పాటు ఆసుపత్రిలో నే చికిత్స పొందిన కమల్ డిసెంబర్ 4న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కమల్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారని.. మరొక రెండు రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని వైద్యులు సూచించారు. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన విషయాన్నీ కూడా కమల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇదిలా ఉండగానే.. అలా డిశ్చార్జ్ అయ్యారో లేదో ఇలా తాను హోస్ట్ గా చేస్తున్న బుల్లితెర రియాలిటీ షో “బిగ్ బాస్ తమిళ్ 5″లో పాల్గొన్నారు కమల్. ఈ వీకెండ్ ఎపిసోడ్ లో ఆయన కనిపించడం గమనార్హం.
కరోనా తగ్గినప్పటికీ కనీసం వారం రోజులు ఎవరినీ కలవకుండా ఉంటే మంచిదన్న విషయంఅందరికీ తెలిసిందే. అయితే ఈ అగ్రహీరో ఆ నిబంధనను ఉల్లంఘించి షూటింగ్ లో పాల్గొనడంపై తమిళనాడు ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇండియా స్థాయిలో గుర్తింపు ఉన్న నటుడు ఇలా చేయడం ఏమిటని కమల్ గురించి దక్షిణాది రాష్ట్రాల అభిమానులు చర్చించుకోవడం మొదలు పెట్టారు. ఇదిలా ఉండగా తాజాగా నోటీసులు కూడా జారీ చేసింది. కాగా కమల్ కోలుకునే వరకు ఈ షోను సీనియర్ నటి రమ్యకృష్ణ హోస్ట్ చేసినది తమిల బిగ్బాస్.