ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇటీవలే బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే తెలుగు చిత్ర పరిశ్రమ లో బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ ఒక హిట్ కాంబినేషన్ అన్న భావన ఉంది. ఎందుకంటే ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన రెండు సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ సాధించాయి. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడో సారి వీరి కాంబినేషన్లో అఖండ అనే సినిమా తెర కెక్కింది. ఇటీవల డిసెంబర్ 2వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.


 ఇక ప్రేక్షకులు ఊహించిన దాని కంటే అద్భుతం  గా ఈ సినిమా ఆకట్టుకుంటూ దూసుకు పోతుంది అని చెప్పాలి. గత కొంత కాలం నుంచి హిట్ లేక   సతమతమవుతున్న బాలకృష్ణకు సూపర్ హిట్ లభించడం తో ప్రస్తుతం బాలయ్య ఫుల్ జోష్ లో వున్నాడు. అయితే ఇటీవలి కాలం లో బాలకృష్ణ ఆహా ఓటీటీ వేదికగా unstoppable అనే  కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక unstoppable బాలకృష్ణ తనదైన వాక్చాతుర్యం తో అదర గొడుతున్నారు అని చెప్పాలి. చేతికి గాయం అయినప్పటికీ అని unstoppable అంటూ దూసుకు  పోతున్నారు.



 ఇక ఇటీవల ఈ కార్యక్రమానికి సంబంధించిన నాలుగవ ఎపిసోడ్ ప్రోమో విడుదల అయింది. ఇక ఈ ప్రోమో లో భాగం గా బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమా చిత్ర బృందం స్పెషల్ గెస్ట్ గా వచ్చారు.. ఈ సందర్భం గా వారందరితో ఎంతో సరదాగా మాట్లాడిన బాలకృష్ణ తనదైన పంచులతో అదర గొట్టారు. ఈ క్రమంలోనే అఖండ సినిమాలో రారా బాలయ్య అనే పాట పై ఉన్న  డాన్స్ స్టెప్స్ unstoppable కార్యక్రమంలో స్టేజ్ పై వేసి అదరగొట్టాడు బాలయ్య. బాలయ్య డాన్స్ చేస్తున్నంతసేపు చూస్తున్న సేపు అందరూ ఆశ్చర్యపోయారు అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: