చిత్ర పరిశ్రమలో లెజెండరీ డైరెక్టర్ పద్మశ్రీ అవార్డు గ్రహీత దాసరి నారాయణ రావు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన చిత్ర పరిశ్రమలో ఎంతో మందికి జీవనోపాధిని కల్పించారు. అంతేకాదు.. ఎన్నో మంచి మంచి సినిమాలకు దర్శకత్వం వహించిన ఈయన ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి హీరోలకు మంచి గుర్తింపును తీసుకొచ్చారు. దాసరి తన సినీ కెరీర్లో ఎంతో మంది స్టార్ హీరోలతో సినిమాలు తీసి మంచి హిట్లును కూడా అందుకున్నారు. దాసరి 151 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ హీరోలుగా గుర్తింపు పొందిన ఎన్టీఆర్, ఏఎన్నార్ చిత్రాలకు ఎక్కువగా పని చేశారు దాసరి.

దాసరి నారాయణ ఎన్టీఆర్‌తో కలిసి సర్దార్ పాపారాయుడు, మనుషులంతా ఒక్కటే, బొబ్బిలి పులి లాంటి సూపర్ హిట్ సినిమాలను చిత్రీకరించారు. అంతేకాదు.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రత్యేక ఖ్యాతిని తీసుకొచ్చిన దాసరికి, ఎన్టీఆర్‌కి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. దాసరి ఎన్టీఆర్‌తో కలసి దాదాపు 5 సినిమాలు చేశాడు. అయితే హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా ఎన్టీఆర్ బిజీగా ఉండటం.. ఇక దర్శకుడిగా, నిర్మాతగా దాసరి కూడా బిజీగా ఉండటం వల్ల ఎన్టీఆర్‌తో ఎక్కువ సినిమాలు తీయడానికి సమయం దొరకలేదు.

అంతేకాదు.. ఎన్టీఆర్ సినిమా అంటే ప్రేక్షకులకు సంబరాన్ని తీసుకొచ్చేది. ఇక ఒకసారి బొబ్బిలి పులి సినిమా తీసేటప్పుడు దాసరి ఎన్టీఆర్‌కు ఫోన్ చేసి.. ఎన్టీఆర్ పాత్ర ఏంటో చెప్పడంతో.. వెంటనే ఓకే చెప్పారంట. అయితే క్లాప్ చెప్పిన తరువాత ఎన్టీఆర్ దాసరిని కథ ఏంటో అడిగి తెలుసుకున్నారంట.. ఇక్కడే అర్థం అవుతుంది వారిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉండేదని. అయితే  సర్దార్ పాపారాయుడు సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు.. ఎన్టీఆర్ అల్లూరి సీతారామరాజు గెటప్ వేసుకొని సెట్ లోకి రావడంతో.. మైమరిచిపోయిన దాసరి ఎన్టీఆర్ కాళ్లకు పాదాభివందనం చేశాడంట. ఆ వేషాధారణలో ఎన్టీఆర్ అందరినీ అంతలా ఆకట్టుకున్నారు. దాసరి.. ఎన్టీఆర్ కాళ్లపై పడటంతో సెట్‌లో అందరూ చూసి ఆశ్చరపోయారంట.

మరింత సమాచారం తెలుసుకోండి: