బాలీవుడ్ నటుడు సోనూసూద్ మరోసారి చిక్కుల్లో పడ్డట్లు తెలుస్తోంది. జుహూలోని తన హోటల్‌ ను అక్రమంగా నిర్మించినందుకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) నటుడికి నోటీసు పంపింది. ఈ ఏడాది జూలైలో సోనూ సూద్‌కు చెందిన జుహు హోటల్‌ను తిరిగి నివాస భవనంగా మార్చాలని, అక్రమ నిర్మాణాన్ని తొలగించాలని బీఎంసీ నోటీసులు జారీ చేసింది. తాను బిఎమ్‌సికి కట్టుబడి ఉన్నానని, ఈ భవనాన్ని తానే పునరుద్ధరించుకుంటానని సోనూ బాంబే హైకోర్టులో చెప్పాడు. అక్టోబర్ 20న బీఎంసీ అధికారి ఈ స్థలాన్ని పరిశీలించారు. ఇందులో ఆయన ప్రణాళిక ప్రకారం పనులు ప్రారంభించలేదని తేలింది.

BMC నోటీసు లో ఏముందంటే ?
ఇప్పుడు ఇటీవల BMC నోటీసులో '1 నుండి 6వ అంతస్తుల భవనంలో మీరు ప్రస్తుతం నివసించే కార్యకలాపాలను నిలిపివేసినట్లు మీ లేఖలో పేర్కొన్నారు. దానిని అంగీకరించిన ప్రణాళిక ప్రకారం నివాసితులు ఉపయోగించాలని పేర్కొంది. అదనంగా / భర్తీ / పునఃస్థాపనకు అవసరమైన పని పురోగతిలో ఉందని కూడా మీరు పేర్కొన్నారు. ఈ కార్యాలయం (BMC కార్యాలయం) 20.10.2021న స్థలాన్ని పరిశీలించింది. మీరు ఆమోదించిన ప్రణాళిక ప్రకారం ఇప్పటి వరకు పని ప్రారంభించలేదని గమనించాము" అని చెప్పింది.
 
మేము ఇప్పటికే భవనాన్ని మార్చాము. వివరాలను బీఎంసీకి సమర్పించాము. ప్రస్తుతం డాక్యుమెంటేషన్ పని జరుగుతోంది. నేను ఎటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు చేయడం లేదు అంటూ గతంలో సోను ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. సోనూసూద్‌ పై గణేష్ కుసములు అనే కార్యకర్త ఫిర్యాదు చేశారు. హోటల్‌ను బాలికల హాస్టల్‌గా మార్చారు. BMC ఈ భవనాన్ని కూల్చివేయాలి అని. నివేదికల ప్రకారం సోను బిఎమ్‌సికి ఇది నివాస ప్రాపర్టీగా మిగిలిపోతుందని, ఎటువంటి అక్రమ నిర్మాణం జరగదని చెప్పినట్లు చెప్పారు.

లాక్‌డౌన్‌లో హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చిన సోనూ సూద్ ఇప్పటికీ ప్రజలకు సహాయం చేయడంలో నిమగ్నమై ఉన్నారని తెలిసిందే. రీసెంట్ గా సౌత్ కొరియోగ్రాఫర్ శివ శంకర్ కి సాయం చేసేందుకు కూడా సిద్ధం అయ్యాడు. శివశంకర్ కరోనా కారణంగా బాధపడుతుంటే, సోను అయన కుటుంబానికి సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు. అయితే అనారోగ్యం కారణంగా శివ శంకర్ మరణించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: