దగ్గుబాటి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్పెషల్ స్దానాని సంపాదించుకుని వెంకటేష్.. విభిన్న కథా చిత్రాలతో విజయం సాధిస్తూ దూసుకుపోతున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేసే విధంగా స్టోరీలు చూస్ చేసుకుంటూ వెళ్తున్న వెంకటేష్ కథ నచ‍్చితే మల్టీ స్టారర్‌ సినిమాలు, రీమేక్‌ చిత్రాలు చేయడానికి అస్సలు వెనుకాడరు అన్న విషయం తెలిసిందే.

ఇప్పటికే తన కెరీర్ లో దాదాపు 25 చిత్రాలకు పైగా రీమేక్ సినిమాల్లో నటించిన వెంకీ..రీసెంట్ గా  'దృశ్యం 2' అనే మలయాళ మూవీ రీమేక్‌ తో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. కాగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ రీమేక్‌ సినిమా చేయడానికి వెంకటేష్ రెడి అయ్యారట. మలయాళంలో సూపర్ డూపర్ హిట్‌ గా నిలిచిన 'డ్రైవింగ్ లైసెన్స్‌' అనే సినిమాని తెలుగులో రీమేక్‌ చేయాలని ప్లాన్ చేస్తున్నారట వెంకీ. నిజానికి ఈ సినిమా ఎప్పటినుంచో తెలుగులోకి రీమేక్ చేయాలి అనుకుంటున్నారట.

 కాగా ఫైనల్ గా  రామ్‌ చరణ్ ఈ సినిమా హక్కుల్ని దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాలో వెంకటేష్‌, రవితేజలు కలిసి నటిస్తున్నారంటూ కూడా సినీ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా 'డ్రైవింగ్‌  లైసెన్స్‌' సినిమా రామ్‌ చరణ్‌ నుంచి గీతా ఆర్ట్స్‌ చేతికి వచ్చింన్నట్లు తెలుస్తుంది. వెంకటేశ్‌తో ఈ సినిమా తీయాలని భావిస్తున్న గీతా ఆర్ట్స్‌  రవితేజ ప్లేస్ లో నాగచైతన్య ని తీసుకుంటున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం 'ఎఫ్‌ 3'తో పాటు ఓ వెబ్‌ సిరీస్‌తో బిజీగా ఉ‍న్న వెంకటేష్..త్వరలోనే 'డ్రైవింగ్‌ లైసెన్స్‌' సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తుంది. 


2019లో విడుదలైన ఈ సినిమా "డ్రైవింగ్ లైసెన్స్" లో పృథ్వీరాజ్ సుకుమారన్, సూరజ్ లీక పాత్రల్లో నటించి అందరిని మెప్పించారు. ఓ సూపర్‌స్టార్ ఊహించని విధంగా  తన డ్రైవింగ్ లైసెన్స్‌ పోగొట్టుకుంటారు. ఈ క్రమంలో అతనికి ఎదురైన వింత ఘటనల నేపథ్యంలో ఈ సినిమా ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది.  ఈ సినిమా నచ్చిన వెంకటేశ్ ఎప్పటినుండో రీమేక్ చేయాలని అనుకుంటే..ఇప్పుడు దానికి టైం వచ్చింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: