ఈ మధ్య కాలంలో మనం చూసిన్నట్లతే రీమేక్ సినిమాలు ఎక్కువ అయిపోతున్నాయి. ఏదైన భాషలో ఒక సినిమా హిట్ అయితే చాలు వెంటనే పక్క భాష నటులు ఆ సినిమాను రీమేక్ చేయడాని సిద్ధమైపోతున్నారు. ఇప్పటికే ఇలాంటి రిమేక్ సినిమాలు బోలెడు చూసాం. మన తెలుగు ఇండస్ట్రీ వారు కూడా ఇలాంటి సినిమాలనే ఇప్పుడు ఎక్కువ ట్రై చేస్తున్నారు. చిరంజీవి , పవన్ కళ్యాణ్, వెంకటేష్ , యంగ్ హీరో నితిన్ ..ఇలా స్టార్ హీరోల నుండి నిన్న మొన్న వచ్చిన కుర్ర హీరోల వరకు అందరు రీమేక్ ల పై ఇంట్రెస్ట్ చూయిస్తున్నారు.

ఇక మనం ఎక్కువగా తమిళ, మలయాళ సినిమాలను రీమేక్ చేస్తుంటే.. మన తెలుగు సినిమాలను బాలీవుడ్ వాళు రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే బడా బడా స్టార్ హీరోల సినిమాలను రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన బాలీవుడ్ డైరెక్టర్స్ కళ్లు ఇప్పుడు బాలయ్య నటించిన "అఖండ" పై పడ్డాయి. యస్.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..రీసెంట్ గా రిలీజై బాక్స్ ఆఫిస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తున్న బాలయ్య అఖండ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.

మంచి క‌లెక్ష‌న్స్‌తో దూసుకుపోతున్న‌ ఈ సినిమా ని ప్రముఖ బాలీవుడ్ ద‌ర్శక‌నిర్మాత సాజిద్ న‌డియాడ్  హిందీలో రీమేక్ చేయ‌డానికి  సన్నాహాలు చేస్తున్నట్లు మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక బాలీవుడ్ లో ఈ సినిమాకి హీరోగా  అక్షయ్ కుమార్ నటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా అఖండ సినిమా బాలీవుడ్ లో రీమేక్ అవుతుంది అని తెలియడంతో బాలయ్య ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. బోయపాటి డైరెక్ట్ చేసిన ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే  పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ముఖ్యంగా ఈ సినిమా లో అఘోరగా కనిపించిన బాలయ్య చెప్పే డైలాగ్స్ సినిమాకే హైలెట్ గా నిలిచాయి.  సరికొత్త రికార్డులను సృష్టిస్తోన్న ఈ సినిమా నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: