అందుకే ఎప్పుడూ రొటీన్ కథలు కాకుండా కొత్త కథలు తీసుకొని ముందుకు వెళ్లే ఆలోచనలో మెగాస్టార్ చిరంజీవి ఉన్నారని ఈ నేపథ్యంలోనే ఆయన భారీ ప్లాన్ చేస్తున్నారని టాలీవుడ్ జనాలు అంటున్నారు. సినిమా కెరీర్ లో చిరంజీవి ప్రస్తుతం ఎన్నడూ లేనివిధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే మాట కూడా కాస్త వాస్తవం. చిరంజీవి ప్రస్తుతం తెలుగు సినిమాలో మకుటం లేని మహారాజుగా ఉన్నా సరే కొన్ని కొన్ని విషయాల్లో ఆయనకు అనుకూలంగా పరిస్థితులు లేకపోవడం గతంలో మాదిరిగా చిరంజీవి సినిమాలకు క్రేజ్ లేకపోవడం వంటివి కాస్త ఇబ్బందికరంగా మారే అవకాశముంది.
అయితే ఇప్పుడు చిరంజీవి కొన్ని కొన్ని విషయాల్లో ఎప్పుడూ లేనివిధంగా బయోపిక్ లకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రముఖ కథలను తెరకెక్కించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని భావిస్తున్నారని ఈ నేపథ్యంలోనే ఒక ప్రముఖుడి బయోపిక్ కోసం చిరంజీవి ప్రయత్నాలు చేస్తున్నారని త్వరలోనే దీనికి సంబంధించి కచ్చితంగా ముందడుగు పడటమే కాకుండా దీనికి సంబంధించి పరుచూరి బ్రదర్స్ ఒక కథ కూడా సిద్ధం చేసి ఇచ్చారని అంటున్నారు.