తెలుగు సినిమాలో సుకుమార్ సినిమాలు అనగానే కాస్త అందరిలో ఆసక్తి ఉండటమే కాకుండా సినిమాల్లో చేసే పాత్రలు కూడా చర్చలు జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం సుకుమార్ అల్లు అర్జున్ హీరోగా పుష్ప అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈ నెల విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత సుకుమార్ మరో భారీ బడ్జెట్ సినిమాకు ప్లాన్ చేస్తూ ఉండగా పుష్ప మొదటి భాగం తర్వాత రెండో భాగం విషయంలో ఆయన కాస్త జాగ్రత్తగా ఉండాలని ఈ సినిమాకు సంబంధించి బాలీవుడ్ ప్రముఖులను కూడా తీసుకునేందుకు రెడీ అయ్యారు అని అంటున్నారు.

ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా ఈ సినిమాను తెరకెక్కించే అవకాశం ఉందని దీనికి సంబంధించి అల్లు అర్జున్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని నిర్మాత కూడా అందుకు అంగీకారం తెలపడంతో ముందుకెళ్లేందుకు రెడీగా ఉన్నారని సమాచారం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారీ బడ్జెట్ సినిమాలో కాస్త తెలుగు సినిమాలు వెనకడుగు వేస్తున్నాయి సరే సుకుమార్ మాత్రం నిర్మాతలు ముందుకు వెళ్ళడమే కాకుండా స్టార్ హీరోలని ఒప్పించి అడుగులు వేసేందుకు రెడీ అవుతున్నారు

పుష్ప సినిమా తర్వాత ఒక చిన్న సినిమాలు చేసేందుకు రెడీగా ఉన్నారని వైష్ణవ్ తేజ్ హీరోగా చేయబోయే సినిమాకు సంబంధించి ఇప్పటికే కథ కూడా రెడీ అవడమే కాకుండా వచ్చే నెలలో షూటింగ్ కూడా మొదలు పెట్టే అవకాశాలున్నాయని అంటున్నారు. రంగస్థలం సినిమా తర్వాత సుకుమార్ చేసిన సినిమాలకు సంబంధించి కాస్త అభిమానుల్లో ఆసక్తి పెరగడమే కాకుండా సినిమాకి సంబంధించి భారీ బడ్జెట్ అనగానే చాలామంది ఆసక్తి కరం గా చూడటం మొదలుపెట్టారు. మరి భవిష్యత్తు ప్రాజెక్టుల విషయంలో సుకుమార్ ఇదే విధంగా ముందుకు వెళ్లలేక పోతున్నారా చిన్న చిన్న సినిమాలు కూడా చేయబోతున్నారా అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: