తెలుగు సినిమాకు సంబంధించి ఈ మధ్య కాలంలో మల్టీస్టారర్ సినిమాలో అనేవి మళ్లీ చర్చకు వస్తున్న నేపథ్యంలో కొంతమంది అగ్రహీరోలు మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు కొంత మంది సీనియర్ నటులతో చర్చలు జరుపుతున్నారని ప్రచారం అలాగే కొంతమంది అగ్ర దర్శకులు కూడా కొన్ని కొన్ని కథలు సిద్ధం చేసుకుని స్టార్ హీరోల కోసం రెడీగా ఉన్నారని దీనికి సంబంధించి నిర్మాతలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు రావడం మాత్రం కాస్త అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారీ బడ్జెట్ సినిమాలకు సంబంధించి ఎటువంటి క్లారిటీ లేకపోయినా మల్టీస్టారర్ సినిమాలకు సంబంధించి మాత్రం పూర్తి క్లారిటీ వస్తుంది.

చిన్న చిన్న సినిమాలు కూడా ఈ మధ్య కాలంలో మల్టీస్టారర్ గా తెరకెక్కే ఈ మంచి విజయాలు సాధిస్తున్న నేపథ్యంలో అగ్ర హీరోలు అయిన మహేష్ బాబు అలాగే అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ వంటి వారు కాస్త జాగ్రత్తగా ముందుకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక ఇటీవల నందమూరి బాలకృష్ణ తెలుగు సినిమా వర్గాలలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన నేపథ్యంలో కొంతమంది హీరోలు ఆయన వెంట పడుతున్నారు.

అల్లు అరవింద్ నిర్మాణ సారధ్యంలో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న బాలకృష్ణ తాజాగా మహేష్ బాబుని ఆహ్వానించగా మహేష్ బాబు సినిమాకు సంబంధించి మాట్లాడారని ఆయన కూడా రెడీగా ఉన్నారని అంటున్నారు.బాలకృష్ణ మల్టీస్టారర్ సినిమా కథ బాగుంటే కచ్చితంగా చేస్తాను అని చెప్పినట్లుగా కూడా వార్తలు రావడం గమనార్హం. అయితే మహేష్ బాబు మల్టీ స్టారర్ సినిమాకు సంబంధించి ప్లాన్ చేయడం బాలకృష్ణను అడగటం అని అర్థం ఏంటండి అది తెలియక పోయినా ఈ సినిమాలో మాత్రం బాలకృష్ణ మహేష్ బాబుకి తండ్రి గా కనపడే విధంగా మహేష్ బాబు ప్లాన్ చేస్తున్నారని టాలీవుడ్ జనాలు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: