బాలయ్య స్టామినా ఏంటో చాటి చెప్పిన మూవీ అఖండ. బాలయ్య వేవ్ ముందూ ఏవీ అసలు తట్టుకోలేవు అని కూడా అంతా ఒప్పుకుంటున్నారు. అఖండ మూవీ నార్త్ ఇండియన్స్ కి బాగా నచ్చిందంట. ఇక అఖండ పాత్ర అయితే అదరహో అంటున్నారుట.

మొత్తానికి టాలీవుడ్ కే పరిమితం అయిన బాలయ్య అఖండ తో ఉత్తర భారతానికి కూడా హాట్ ఫేవరేట్ హీరో అయిపోయాడు. దాంతో పాటు బాలయ్య అఖండతో తొందరలోనే వంద కోట్ల క్లబ్ లో చేరే సీన్ కనిపిస్తోంది. ఇక బాలయ్య పొటెన్షియాలిటీని చూసిన మేకర్స్ కొత్త ఆలోచనలు చేస్తున్నారుట.

బాలయ్యకు సరైన కంటెంట్ పడితే ఆకాశమే హద్దు అన్నట్లుగా రెచ్చిపోతాడని అఖండ మరో సారి నిరూపించింది అంటున్నారు. ఈ మూవీ తరువాత బాలయ్య వరసగా చేసే సినిమాలు బ్లాక్ బస్టర్స్ అని కూడా చెబుతున్నారు. అలాంటి డైరెక్టర్స్ తో బాలయ్య చేస్తున్నాడు. ఇదిలా ఉంటే బాలయ్య తో పాన్ ఇండియా మూవీ చేయడం ఈజీయే అన్న మాట ఉంది.

బాలయ్య పౌరాణికాలకు బాగా నప్పుతాడు. అలాగే హిస్టారికల్ జానర్ అయినా. జానపద జానర్ అయినా బాలయ్యకు కొట్టిన పిండిగానే ఉంటుంది అంటున్నారు. ఇక సోషియో ఫాంటసీ మూవీస్ చేయవచ్చు. అలాగే అఖండ లాంటి రేర్ క్యారెక్ట‌ర్స్ ని చేయిస్తే ఆల్ ఓవర్ ఇండియా అప్పీల్ ఉంటుందని కూడా మేకర్స్ కొత్త ఆలోచనలు చేస్తున్నారుట.

మొత్తానికి సరైన సబ్జెక్ట్  పడితే ఈ సీనియర్ హీరోతో పాన్ ఇండియా మూవీ అయినా పంట పండడం ఖాయమే అంటున్నారు. ఇక యూఎస్ మార్కెట్ ని కూడా బాలయ్య బాగా మెరుగుపరచుకున్నాడని కూడా అఖండ రిజల్ట్ చెబుతోంది.సో బాలయ్యతో పాన్ ఇండియా మూవీ గ్యారంటీయే. ఎపుడు అన్నదే సస్పెన్స్. సీనియర్ హీరోలలో బాలయ్య పాన్ ఇండియా లెవెల్ మూవీ చేస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది మరి. సో అంతా వెయిటింగ్.




మరింత సమాచారం తెలుసుకోండి: