ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ ల క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా పుష్ప. మొత్తం రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ భారీ పాన్ ఇండియా మూవీ ఐదు భాషల్లో ఈ నెల 17న ఎంతో భారీ ఎత్తున విడుదల కానుంది. సక్సెస్ఫుల్ హీరోయిన్ రష్మిక మందన్న అల్లు అర్జున్ కి జోడీగా నటిస్తున్న ఈ మూవీలో సునీల్, అనసూయ, కన్నడ నటుడు ధనుంజయ తదితరులు ఇతర పాత్రలు చేస్తుండగా ఫహాద్ ఫాసిల్ విలన్ గా నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ టీజర్, సాంగ్స్ ఇప్పటికే రిలీజ్ అయి అందరినీ ఎంతో ఆకట్టుకున్నాయి.

అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూపులు చూస్తున్న పుష్ప థియేట్రికల్ ట్రైలర్ కొన్ని క్షణాల క్రితం యూట్యూబ్ లో రిలీజ్ అయి సూపర్ గా క్రేజ్ తో దూసుకెళుతోంది. అల్లు అర్జున్ మాస్, లుక్స్, వండర్ఫుల్ డైలాగ్స్, రష్మిక అదిరిపోయే లుక్స్, విలన్ ఫహద్ ఫాసిల్ సూపర్ స్క్రీన్ పెర్ఫార్మన్స్, అలరించే విజువల్స్, యాక్షన్, ఫైట్ సీన్స్ తో పాటు సంగీత దర్శకడు దేవిశ్రీప్రసాద్ అందించిన బీజీఎమ్ పుష్ప ట్రైలర్ అందరిని ఆకట్టుకునేలా చేస్తోంది. ముఖ్యంగా ట్రైలర్ లో 'ఈలోకం మీకు తుపాకి ఇస్తే నాకు గొడ్డలి ఇచ్చింది', 'పుష్ప అంటే ఫ్లవర్ కాదబ్బా ఫైర్' అంటూ పలికే మాస్ డైలాగ్స్ నిజంగా ఎంతో సూపర్బ్ గా ఉన్నాయి.

మొత్తంగా ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటూ భారీ లైక్స్, వ్యూస్ అందుకుంటూ యూట్యూబ్ లో దూసుకెళ్తున్న పుష్ప ట్రైలర్, మూవీపై అందరిలో ఏకంగా ఆకాశం అంత భారీ అంచనాలు పెంచింది అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈ నెల 12న హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు సమాచారం. మరికొద్దిరోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాజన్న పుష్పరాజ్ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.




మరింత సమాచారం తెలుసుకోండి: