మెగాస్టార్ చిరంజీవికి ఓ హార్డ్ కోర్ ఫ్యాన్ రాసిన లేఖ సంచలనమవుతోందని సమాచారం . సోషల్ మీడియాను ఊపేస్తోందని తెలుస్తుంది.. చిరంజీవిని అభిమానులమైన తాము ఎలా చూడాలనుకుంటున్నామో ఆ లేఖలో ఘాటు పదాలతో 'కర్ర విరగకుండా చిరంజీవికి దెబ్బపడేలా' వివరించాడని తెలుస్తుంది.

రిమేకులపై ఆధారపడిన చిరంజీవి ఆ అభిమాని లేఖలో కడిగేశాడట.. 'మన దగ్గర కథలు లేవా? కథనాలు లేవా? మీరు ఏదో మాటవరసకి 'అర్థాకలి' అంటూ ఉంటారని చెప్పుకొచ్చాడటా. కానీ మీకు ఆకలే లేదని రుద్రవీణ సినిమాలో ఆ సూర్యం పాత్రలో 'నేను సైతం' అంటూ బయటకొచ్చే నటుడు నాకు కనిపించట్లేదని .' అంటూ చిరంజీవి తీరును సుతిమెత్తగా దెప్పి పొడిచాడట ఆ అభిమాని.

' అస్సలు మీ రేంజ్ ఏంటి మీరు చేసే కథలేంటి? ఇంకెన్ని రోజులండి ఈ కథలు రాయడం రాని కథకులతో సినిమాలు 
చేస్తారు .వీళ్లు సీన్లు తీయడంలో సినిమాని మర్చిపోయారని మీరు పస్తు ఉండండి కొన్నిరోజులు అంటూ రెచ్చిపోయాడట.చిరంజీవి కనిపించకుండా ఆ సినిమాలో పాత్ర మాత్రమే కనిపించేలా నటించండి అంటూ అది చూడాలనుంది అంటూ చెప్పుకొచ్చాడటా. తప్పుగా భావించకండి మీకు అద్దం చూపించాలి' అంటూ చిరంజీవి పాత చింతకాయపచ్చడి కథలతో తీస్తున్న సినిమాలపై సునిశిత విమర్శలు చేశారట.

ఒక సినిమాలో ఆ తార కాకుండా ఆ పాత్ర మాత్రమే కనిపించినప్పుడు అది అసలి నటన అని కన్యాశుల్కంలో ఎన్టీఆర్ కనిపించడు కాని గిరీశం మాత్రమే కనిపిస్తాడని చంటబ్బాయిలో చిరంజీవి కనిపించడు కానీ పాండురంగారావు మాత్రమే ఉంటాడు అంటూ 'నాకు ఆ చిరంజీవి కావాలి' అంటూ అభిమాని తన మనసులోని కోరికను మెగాస్టార్ ను ట్యాగ్ చేస్తూ అడిగేశాడట.మరి దీన్ని చిరంజీవి పాటిస్తాడా? లేదా? అన్నది చూడాలి మరి. ప్రస్తుతానికి ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని తెలుస్తుంది.మరి ఈ లేఖ పై మెగా అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: