యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ తో హీరోయిన్ గా మొదలైన తన ప్రయాణం ఇప్పుడు వెండితెరపై మెరిసేలా నటించారట ప్రియాంక జువాల్కర్‌.

రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన'టాక్సీవాలా' చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారట ఈ ముద్దుగుమ్మ.ఆ తరవాత 'ఎస్‌.ఆర్‌. కల్యాణమండపం', 'తిమ్మరుసు'వంటి చిత్రాలతో విజయాలు అందుకుందని తెలుస్తుంది. ప్రస్తుతం లేడీ డైరెక్టర్ సంజనారావు సృజన రావు దర్శకత్వంలో ఉపకథల సమ్మేళనంగా తెరకెక్కిన చిత్రం 'గమనం'.ఈ నెల 10న విడుదలకు సిద్ధంగా ఉందని సమాచారం. ఈ సందర్భంగా ప్రియాంక జువాల్కర్‌ ఒక ఇంటర్వ్యూలో తన పాత్ర గురించి ముచ్చటించారని తెలుస్తుంది.


ఈ సినిమాలో నేను ఓ ముస్లిం అమ్మాయి పాత్రలో 'ఝూరా'గా కనిపిస్తానని చెప్పుకొచ్చిందట.ఈ పాత్ర కోసం నన్ను ఆడిషన్‌ కూడా చేశారని బుర్ఖాలో ఎలా కనిపిస్తానో అనే లుక్‌ టెస్ట్‌ చేసి ఓకే చేశారట.ఈ పాత్రకు డైలాగులు చాలా తక్కువగా ఉంటాయని కొన్ని సన్నివేశాలు కేవలం కళ్లతోనే నటించానని అప్పుడు కాస్త కష్టంగా అనిపించిందని కానీ ఇదో కొత్త అనుభవం అని అన్నారట ప్రియాంక. అయితే నేను తెల్లగా ఉంటాను కమర్షియల్‌ కథలకు మాత్రమే పనికొస్తానని అందరూ అనుకుంటారట. నాకు విలేజ్‌ అమ్మాయి పాత్రలు సెట్‌ కావు అనుకుంటారు కానీ ఈ సినిమా చూశాక ఆ అభిప్రాయం మారుతుందని చెప్పుకొచ్చిందట. 'గమనం' కథ వినగానే నచ్చింది ఆ పైగా ఈ సినిమాకి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారని చెప్పారు ఇంకా ఏమీ ఆలోచించకుండా ఓకే చేశానని కథ డిమాండ్‌ చేస్తే బోల్డ్‌గా నటించడానికి కూడా సిద్ధమే అని చెప్పుకొచ్చారట ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాలో శ్రియ మరియు శివ కందుకూరి, నిత్యామేనన్‌ ప్రధాన పాత్రలో నటించారట.క్రియ ఫిల్మ్‌ క్రాప్‌ మరియు కాళీ ప్రొడెక్షన్స్‌ సంయుక్తంగా రమేష్‌ కరుటూరి, వెంకీ పుషదపు అలాగే జ్ఞానశేఖర్‌ వి.ఎస్‌ నిర్మించారని ఇళయరాజా సంగీతం అందించారని తెలుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: