సాధారణంగా ఒక సినిమాకు రివ్యూలు బాగా రాకపోతే మరుసటి రోజు నుండే టాప్ హీరోల సినిమాలు అయినప్పటికీ కలక్షన్స్ పడిపోతాయి. అయితే దీనికి విరుద్ధంగా ‘అఖండ’ విషయంలో రోజురోజుకు ఈసినిమా కలక్షన్స్ పెరగడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి బాలకృష్ణ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడు. కనీసం అతడి అభిమానులతో సోషల్ మీడియా ద్వారా ఛాట్ చేసిన సందర్భాలు కూడ లేవు.


అలాంటి బాలయ్య నటించిన ‘అఖండ’ మూవీకి సోషల్ మీడియాలో కూడ మంచి పాజిటివ్ కామెంట్స్ వచ్చేవిధంగా నడిచిన వ్యూహంలో ఒక యంగ్ ప్రొడ్యూసర్ హస్తం ఉంది అన్న వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఆ యంగ్ ప్రొడ్యూసర్ బాలకృష్ణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని అతడికి అమెరికాలో ఉంటున్న వారితో ఉన్న హై లెవెల్ కనెక్షన్స్ తో ఈమూవీకి ఓవర్సీస్ లో కూడ పాజిటివ్ టాక్ వచ్చే విధంగా వ్యూహాలు నడిపించాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.


ఆ యంగ్ ప్రొడ్యూసర్ కు మెగా హీరోలతో మంచి సాన్నిహిత్యం కూడ ఉంది అన్నప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితులు ఇలా ఉంటే బాలకృష్ణ తన చేతికి జరిగిన ఆపరేషన్ కట్టు ఇంకా పూర్తిగా తీయకుండానే ‘అన్ ష్టాపబుల్’ షోను తిరిగి ప్రారంభించడమే కాకుండా బ్రహ్మానందం అనీల్ రావిపూడి లతో చేసిన షో కూడ క్లిక్ అవ్వడంతో ఇక బాలయ్యకు ఎదురులేదు అనిపిస్తోంది.


అంతేకాదు అల్లు అరవింద్ సొంత నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బాలయ్యతో సంపత్ నంది దర్శకత్వంలో ఒక మూవీని త్వరలో ప్రారంభించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు వస్తున్న వార్తలను బట్టి బాలయ్య అందరివాడు అయ్యాడు అనుకోవాలి. ఈమూవీ కాకుండా బాలయ్య అనీల్ రావిపూడి దర్శకత్వంలో మరొక మూవీ చేయడమే కాకుండా పూర్తిగా తనలోని కామిడీ యాంగిల్ ను బయటపెట్టబోతున్నాడు అని వస్తున్న వార్తలు 62 సంవత్సరాల వయస్సులో బాలయ్య స్పీడ్ ను సూచిస్తున్నాయి..




మరింత సమాచారం తెలుసుకోండి: