నిన్న సాయంత్రం విడుదలైన ‘పుష్ప’ లేటెస్ట్ ట్రైలర్ కూడ సోషల్ మీడియాలో సంచలనంగా మారడంతో ‘పుష్ప’ పై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఒమైక్రాన్ కేసులు రోజురోజుకు పెరగడమే కాకుండా ఆవేగం మరింత పెరిగి జనవరి నెలాఖరుకు కానీ ఫిబ్రవరి మొదటివారానికి కానీ పీక్ కు చేరిపోతాయి అని వార్తలు వస్తున్నప్పటికీ ఈ విషయాలను పక్కకు పెట్టి ‘పుష్ప’ డిసెంబర్ 17న రిలీజ్ కు రెడీ అయిపోతోంది.


ఈ పరిస్థితులు ఇలా ఉంటే సంక్రాంతి రేసుకు రాబోతున్న భారీ సినిమాలు అన్నీ ‘అఖండ’ సూపర్ సక్సస్ తో చెట్టెక్కి కూర్చున్నాయని వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ లో టిక్కెట్ల రెట్లు పెంపుదలకు అవకాశాలు లేకపోవడంతో పాటు కరోనా పరిస్థితుల భయాల మధ్య సంక్రాంతి సినిమాలను కొనుక్కున్న బయ్యర్లు తాము గతంలో ఒప్పుకున్న రేట్లకు సంబంధించి కనీసం 25 శాతం తగ్గించమని ఇప్పటివరకు బేరసారాలు ఆడారు.


అయితే ‘అఖండ’ సినిమాకు వస్తున్న అత్యంత భారీ కలక్షన్స్ చూసి సంక్రాంతి సినిమా నిర్మాతలు ముఖ్యంగా ‘పుష్ప’ ‘ఆర్ ఆర్ ఆర్’ ‘భీమ్లా నాయక్’ ‘రాథే శ్యామ్’ నిర్మాతలు తాము గతంలో చెప్పిన రేట్లకు ఏమాత్రం తగ్గవని తమ బయ్యర్లతో గట్టిగా మాట్లాడటమే కాకుండా ‘అఖండ’ సినిమా కలక్షన్స్ ను ఉదాహారణగా చూపెడుతున్నట్లు టాక్.దీనితో సంక్రాంతి సినిమాల బయ్యర్లు ఎలాగైనా బేరసారాలు ఆడి తమ పంతం నెగ్గించుకోవాలి అని గట్టి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ నిర్మాతల నుండి ఎలాంటి స్పందన లేదు అని టాక్.


పరిస్థితులు ఇలా కొనసాగుతూ ఉండగా ‘అఖండ’ మూవీకి నిన్న సోమవారం రోజున కూడ కలక్షన్స్ బాగా రావడమే కాకుండా చాల చోట్ల ధియేటర్లకు హోసే ఫుల్ బోర్డ్స్ కనిపించడంతో ఈమూవీ ఏ రేంజ్ హిట్ కు చేరుకుంటుంది అన్నది అంచనాలకు కూడ అందడం లేదు అంటున్నారు. ‘అఖండ’ మూవీకి వస్తున్న స్పందన ‘పుష్ప’ ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలకు కూడ కొనసాగితే సినిమాల మ్యానియా ఒమైక్రాన్ భయం కూడ ఓడిపోయింది అనుకోవాలి..





మరింత సమాచారం తెలుసుకోండి: