మెగా కోడలు ఉపాసన కొణిదెల సోషల్ మీడియాలో ఎంతగానో యాక్టివ్గా ఉంటారు. తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు ఉపాసన. ఇక అంతే కాదు ఎన్నో సామాజిక విషయాలపై మాట్లాడుతూ అందరికీ అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఇలాసోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక ఇటీవలే సోషల్ మీడియా వేదికగా ఉపాసన పెట్టిన ఒక ఎమోషనల్ పోస్ట్ వైరల్ గా మారిపోయింది.



 ప్రస్తుతం ఉపాసన కొణిదెల సోదరి అనుష్క కామినేని వివాహ వేడుక దోమకొండ గడికోట లో ఘనంగా జరుగుతుంది. ఇక ఈ వివాహ వేడుకలో కామినేని కుటుంబం సంప్రదాయం ప్రకారం పెళ్లికి ముందు పోచమ్మ పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అటు మెగా కుటుంబం కూడా హాజరు కావడం గమనార్హం. ఈ క్రమంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన కూడా ఈ సెలబ్రేషన్స్ లో సందడి చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఇక ఈ సెలబ్రేషన్స్ కు సంబంధించిన వీడియోలు ఫోటోలు ఇప్పటికే తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఉపాసన.


 ఇకపోతే ఇటీవలే తన సోదరి పెళ్లి వేడుకలో తాను ధరించిన దుస్తుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఆ దుస్తులతో తనకు ఎంత అనుబంధం ఉంది అన్న విషయాన్ని చెప్పుకొచ్చింది మెగా కోడలు ఉపాసన. ఈ క్రమంలోనే తన సోదరి పెళ్లి లో తన వివాహ విశేషాలను గుర్తు చేసుకున్నారు. 9ఏళ్ళ క్రితం తన పెళ్లి వేడుకలో పోచమ్మ పండుగ సెలబ్రేషన్స్ లో వేసుకున్న దుస్తులకు ఇక ఇప్పుడు రీ క్రియేట్ చేసి తన సోదరి వివాహ వేడుకకు వేసుకున్నాను అంటూ ఉపాసన చెప్పుకొచ్చింది. దుస్తులను వేసుకోవడం వాటిని భద్రపరచడం ఎంతో ఇష్టం. నాకు గర్వంగా కూడా ఉంటుంది. నాణ్యత ఉన్న వస్త్రాలను షాపింగ్ చేయడం కూడా ఎంతో ఇష్టం. దుస్తువులతో వెలకట్టలేని ఎమోషన్స్ ఉంటాయి అంటూ ఉపాసన చెప్పుకొచ్చారు. ఉపాసన పోస్ట్ పై సమంత బ్యూటిఫుల్ అంటూ రియాక్షన్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: